బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2016 (11:36 IST)

ఢిల్లీలో కదిలే రైలులో యువతిపై అత్యాచారం.. లైంగిక దాడికి సహకరించకపోవడంతో దాడి..

ఢిల్లీలో మరో యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది. పెళ్ళికి వెళ్తున్న ఓ మహిళపై రైలులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలో ఓ వివాహనికి వెళ్తుండగా రైలులోనే దుండగుడు ఆమెను దారుణంగా రేప్ చేశాడు. నిందితుడిని

ఢిల్లీలో మరో యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది. పెళ్ళికి వెళ్తున్న ఓ మహిళపై రైలులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలో ఓ వివాహనికి వెళ్తుండగా రైలులోనే దుండగుడు ఆమెను దారుణంగా రేప్ చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన ఓ మహిళ తమ బంధువుల వివాహానికి ఢిల్లీ వెళ్ళేందుకు రైలులో ప్రయాణిస్తోంది. ఆమె మహిళల కోచ్ ప్రయాణిస్తోంది. 
 
అయితే ఈ కోచ్‌లో ఐదుగురు మహిళలు ఉన్నారు. షాదారాలో రైల్వేస్టేషన్‌లో నలుగురు మహిళలు రైలు దిగివెళ్ళిపోయారు. నలుగురు మహిళలు దిగిన వెంటనే ఆ బోగిలోకి ముగ్గురు దుండగులు వచ్చారు. ఆమె వద్ద ఉన్న బంగారం, వస్తువులు, నగదును దోచుకొన్నారు. ఇద్దరు పారిపోయారు. అయితే బోగిలో ఎవరూ లేకపోవడంతో ఓ దుండగుడు ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
లైంగిక దాడికి ఆమె సహకరించకపోవడంతో ఆమెపై ఆ దుండగుడు దాడి చేశాడు. అతని తీవ్రంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విన్న కొందరు పోలీసులు.. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.