పోర్న్ వెబ్ సైట్లను నిషేధించాలి: సుప్రీంను ఆశ్రయించిన మహిళా న్యాయవాదులు
నీలిసైట్ల వల్ల మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలని కోరుతూ మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుండటంతోనే అన్ని రకాల పోర్న్ వెబ్ సైట్లను నిషేధించాలని కోరారు. సుప్రీం కోర్టు మహిళా న్యాయవాదుల సంఘం ఓ పిటిషన్ దాఖలు చేసింది.
జులై 31న 857 పోర్న్ సైట్లపై కేంద్రం నిషేధం విధించగానే దేశవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్ట్ నాలుగున నిషేధాన్ని తొలగించింది. ఇది జరిగి నెల కూడా కాకముందే మహిళా న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టు జోక్యం కోరింది. దేశంలో పోర్న్ సైట్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, ఈ దృశ్యాలు చూస్తున్న యువత పాడైపోతోందని, ఫలితంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మహిళా న్యాయవాదులు అంటున్నారు.