బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (18:13 IST)

శివసేన ఎంపీకి చుక్కలు : "గైక్వాడ్ నేమ్ ఫిల్టరింగ్ ఇన్‌స్టాల్" చేసిన ఎయిరిండియా.. టిక్కెట్ క్యాన్సిల్

తమ సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఘటనకు సంబంధించిన మహారాష్ట్రలోని శివసేన పార్టీకి చెందిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ రవీంద్ర గైక్వాడ్‌కు పగటిపూటే చుక్కలు చూపిస్తోంది. కేవలం ఆ సంస

తమ సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఘటనకు సంబంధించిన మహారాష్ట్రలోని శివసేన పార్టీకి చెందిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ రవీంద్ర గైక్వాడ్‌కు పగటిపూటే చుక్కలు చూపిస్తోంది. కేవలం ఆ సంస్థ సిబ్బంది మాత్రమే కాదండోయ్... ఎయిరిండియా టిక్కెట్ బుకింగ్ సిస్టమ్ సైతం భగ్గుమంటోంది. 
 
పౌరవిమానయానమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సర్దిచెప్పినప్పటికీ.. ఎయిరిండియా మాత్రం ఏమాత్రం పట్టువీడటం లేదు. అందుకే.. దేశంలోనే కాదు... ప్రపంచంలో ఎక్కడనుంచైనా గైక్వాడ్ పేరు మీద టిక్కెట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నించినా దాన్ని అడ్డుకునేలా నేమ్ ఫిల్టరింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. దీంతో ఆయన రకరకాల పేర్లతో విమాన టికెట్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడటం లేదు. 
 
గతంలోనే మూడు సార్లు ఇలాంటి ప్రయత్నం చేసి విఫలం కాగా... తాజాగా శుక్రవారం ఉదయం 5 గంటలకు మళ్లీ టికెట్ బుక్ చేసేందుకు ప్రత్నించినట్టు ఎయిరిండియా అధికారులు వెల్లడించారు. ఈ నెల 17న ఢిల్లీ నుంచి ముంబైకి, 24న ముంబై నుంచి ఢిల్లీకి టికెట్ బుక్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. వెంటనే నేమ్ ఫిల్టర్ ఆ పేర్లను ట్రాక్ చేసింది. దీంతో అప్రమత్తమైన బుకింగ్ సిబ్బంది.. బుక్ చేసిన టికెట్‌ను క్యాన్సిల్ చేశారు. 
 
దీనిపై ఎయిరిండియా అధికారి ఒకరు మాట్లాడుతూ.. "మా బుకింగ్ సిస్టమ్‌లో పేర్లను గాలించే ఫిల్టర్లను ఇన్‌స్టాల్ చేశాం. గైక్వాడ్‌ను పోలిన ఆరు రకాల పేర్లు ఫిల్టర్ అయ్యాయి. ఈ ఆరు రకాల పేర్లతో ఎవరైనా టికెట్ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే మా సిబ్బంది అప్రమత్తమవుతారు" అని పేర్కొన్నారు. రవీంద్ర గైక్వాడ్, ఆర్ గైక్వాడ్, ప్రొఫెసర్ వి.రవీంద్ర గైక్వాడ్, ప్రొఫెసర్ రవీంద్ర గైక్వాడ్ వంటి పేర్లను తమ బుకింగ్ సిస్టమ్ ఫిల్టర్ చేస్తుందన్నారు. కాగా భేషరతుగా క్షమాపణ చెప్పేవరకు ఎంపీ గైక్వాడ్‌ను విమానాల్లోకి ఎక్కనిచ్చే ప్రసక్తే లేదని ఎయిరిండియా కాబిన్ క్రూ అసోసియేషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.