శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 జూన్ 2017 (21:00 IST)

నాసాకు 64 గ్రాముల 'కలాంశాట్' ఉపగ్రహం.... చరిత్ర సృష్టించిన భారతదేశ విద్యార్థి...

భారతదేశ విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట 64 గ్రాములు బరువున్న 'కలాంశాట్' అనే ఉపగ్రహాన్ని నాసాకు అందించాడు. ఈ ఉపగ్రహాన్ని నాసా గురువారం నాడు ప్రయోగించింది. దీనితో ఇతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్పోగిపోతోంది. తమిళనాడులోన

భారతదేశ విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట 64 గ్రాములు బరువున్న 'కలాంశాట్' అనే ఉపగ్రహాన్ని నాసాకు అందించాడు. ఈ ఉపగ్రహాన్ని నాసా గురువారం నాడు ప్రయోగించింది. దీనితో ఇతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్పోగిపోతోంది. తమిళనాడులోని పల్లపట్టి పట్టణ వాసి రిఫత్ షారూఖ్ ఈ రికార్డు నెలకొల్పాడు. ఇతడికి 18 ఏళ్లు. అతను రూపొందించిన ఈ కలాంశాట్ ప్రపంచంలోకెల్లా అతిచిన్న ఉపగ్రహం కావడం గమనార్హం.
 
నాసా నిర్వహించిన పోటీల్లో స్మార్ట్ ఫోన్ కంటే కూడా తేలికైన బుల్లి ఉపగ్రహాని ఇతడు తయారుచేశాడు. తను రూపొందించిన ఈ ఉపగ్రహం పేరును కలాంశాట్ అని పేరు పెట్టాడు. భూ ఉపకక్ష్యలోకి ప్రయోగించిన ఈ ఉపగ్రహం ప్రయోగ కార్యక్రమం వ్యవధి 240 నిమిషాలే కావడంతో ఆ తర్వాత అది సముద్రంలో పడిపోతుంది. 
 
కాగా ఉపగ్రహం 12 నిమిషాలపాటు అంతరిక్షంలో పనిచేస్తూ త్రీడీ ప్రింటెడ్ కార్బన్ ఫైబర్ పనితీరును తెలుసుకుంటుంది. తొలిసారిగా ఒక భారత విద్యార్థి తయారు చేసిన ఉపగ్రహాన్ని నాసా ప్రయోగించటం ఇదే ప్రథమం కావడం విశేషం.