తెలంగాణ చరిత్ర పుటలలో మరో అధ్యాయం... ఆటా తెలంగాణ మహా సభల ప్రత్యేకం(ఫోటోలు)

(జూలై 10 డెట్రాయిట్): ఒకసారి తెలంగాణ మట్టి పట్టుకుని చెవి దగ్గర పెట్టి విని చూడమని చెప్పింది అమెరికా తెలంగాణ సంఘం. అంతేకాదు, అట్ల విన్నపుడు ఏం వినిపిస్తుందో కళ్ళారా చూపించింది. తెలంగాణ నేలతల్లినీ, చెమ

ATA-Celebrations
ivr| Last Updated: సోమవారం, 11 జులై 2016 (20:56 IST)
(జూలై 10 డెట్రాయిట్): ఒకసారి తెలంగాణ మట్టి పట్టుకుని చెవి దగ్గర పెట్టి విని చూడమని చెప్పింది అమెరికా తెలంగాణ సంఘం. అంతేకాదు, అట్ల విన్నపుడు ఏం వినిపిస్తుందో కళ్ళారా చూపించింది. తెలంగాణ నేలతల్లినీ, చెమట చుక్కలని, పూల పండుగలని, కొలువైన ఇలవేలుపులని, కళాకారులని, కోలాటం, చిందు బాగోతాలతో పాటుగా సమస్త కళారూపాలని, పాటల స్వరూపాలని, సమరుజ్జీవనాలైన పండుగలని, మతాల భిన్నత్వాలలో తెలంగాణ ఏకత్వాన్ని, యాసని, భాషని, త్యాగాలని, త్యాగధనులనీ, మహనీయులనీ, నదుల సింగారాలు, పాతబస్తీ సోయగాలని, శాతవాహన, సమ్మక్క సారక్కల, కాకతీయుల నుండి ఐలమ్మల నుండి మలిదశ ఉద్యమం వరకు పోరాటాల ధిక్కార స్వరాలని, పోరాటాల స్వరూపాలని, తెలంగాణ పడిన కష్టాలని, పునర్నిర్మాణంలో ఇప్పుడు జరుగుతున్న వికేంద్రీకరణనీ నృత్య, గాన, చిత్ర సమ్మేళనమైన ప్రదర్శనతో ఒకసారి తెలంగాణ మట్టి వాసన ఎట్ల ఉంటదో చూపించింది అమెరికా తెలంగాణ సంఘం. సుద్దాల అశోక్ తేజ ఈ తెలంగాణ సభలని పురస్కరించుకొని రాసిన “శ్రీ తెలంగాణకు సిరిమల్లె పువ్వు” పాట, హేమా భమిడిపాటి కొరియోగ్రఫీ చేసిన ఈ ప్రారంభ గీతం ఏకబిగిన 28 నిముషాల పాటు వందల మంది కళాకారులు రోమాంఛితమైన ప్రదర్శనని అందించారు. 
 
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్న ఎందరో ఆశీనులై ఉన్న సభలో, కోట్ల రూపాయలు విలువ ఆడియో వీడియో సెట్టింగ్‌లో, వేలాదిమందిని ఒకచోట చేర్చిన సభలో, దేశం కాని దేశంలో ఒక ప్రపంచ స్థాయి వేదిక మీద తెలంగాణ పాట, బతుకమ్మ, బోనం, మొత్తంగా తెలంగాణ సమాజం గెలిచి నిలిచిన ఈ ప్రస్థానం ఉద్యమంలో పాలుపంచుకున్న ఎందరినో ఉద్వేగపూరితమైన ఆనందంలో ముంచెత్తింది.దీనిపై మరింత చదవండి :