గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 జూన్ 2016 (21:38 IST)

మొదటి అమెరికన్ తెలంగాణ మహాసభలు( డెట్రాయిట్, 8-10 జూలై)

మరో మూడు వారాల్లో తొలి అమెరికా తెలంగాణ ఉత్సవాలు డిట్రాయెట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఉత్సవాలు జూలై 8 నుంచి 10 వరకూ జరుగుతాయి. ఈ సమావేశాలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రారంభిస్తారు. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా

మరో మూడు వారాల్లో తొలి అమెరికా తెలంగాణ ఉత్సవాలు డిట్రాయెట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఉత్సవాలు జూలై 8 నుంచి 10 వరకూ జరుగుతాయి. ఈ సమావేశాలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రారంభిస్తారు. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు- తెరాస ఎంపీ కవిత, డిప్యూటీ ముఖ్యమంత్రి మహ్మద్ అలీ, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి విచ్చేయనున్నారు. 
 
సుమారు ఐదు వేల మంది ప్రతినిధులు అమెరికా, భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా హాజరవుతారు. అమెరికాలోని 35 ప్రాంతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరకానున్నారు. 200 మంది వాలంటీర్లతో 40 కమిటీలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నిత్యం కృషి చేస్తున్నాయి. నాగెందర్ మాట్లాడుతూ... వినోద్ కుకునూర్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారనీ, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి రానున్నారని, తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటే అని ఈ కార్యక్రమం ద్వారా నిరూపితమవుతుందని అన్నారు.
 
ఎ.టి.ఎ ఆధ్వర్యంలో జూలై 8,9,10న నిర్వహించనున్న అంతర్జాతీయ తెలంగాణ మహాసభల కార్యక్రమం కోసం ఫండ్ రైజింగ్ సమావేశాన్ని జూన్ 3న అమెరికాలోని సెయింట్ తోమ చర్చిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 800 మంది పాల్గొన్నారు. అనూహ్యంగా కొద్ది గంటల్లోనే 4 లక్షల డాలర్లు వసూలయ్యాయి.
 
కాగా జూలైలో మూడురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వినోదభరితమైన ప్రోగ్రాములు కూడా ఉంటాయని వైస్ కన్వీనర్ నాగేందర్ ఐత వెల్లడించారు. జూలై 8న పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. వ్యాపారం, విద్య, సాహిత్యంలో ప్రగతి సాధించినవారికి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జూలై 9న ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన పాటకు 60 మందికి పైగా చిన్నారులు ప్రదర్శన ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
 
తెలంగాణ సంప్రదాయ పండుగలైన బతుకుమ్మ, బోనాలకు సంబంధించిన ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత అనూప్ రూబెన్స్ సంగీత విభావరితో జూలై 8 కార్యక్రమం ముగుస్తుంది. 9న తెలంగాణలోని యాదగిరిగుట్ట నుంచి తెప్పించిన లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలతో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం జరుగుతుందన్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి పూజారులు వస్తారన్నారు. ఈ కార్యక్రమాలన్నిటినీ విజయవంతంగా నిర్వహించేందుకు రేయింబవళ్లు పనిచేస్తున్నట్లు కుక్నూర్ తెలిపారు.