1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (16:28 IST)

విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠిస్తే?

కష్టాలతో విసిగిపోయారా? విష్ణు సహస్రనామం చదవండి.. అంటున్నారు. ఆధ్యాత్మిక పండితులు. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. 
 
అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 
 
అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?
1. అదృష్టం
2. ఆర్థిక ఇబ్బందులు వుండవు 
3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం 
4. కోరిన కోరికలు నెరవేరుతాయి
5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది
 
విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.