ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (18:55 IST)

తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుతున్నారా? ఇవి తెలుసుకోండి..

Betel Leaf
ఇంట్లో తమలపాకు చెట్టు పెంచితే ఆర్థిక ఇబ్బందులు వుండవని వాస్తు నిపుణులు చెప్తున్నారు. తమల పాకును పలు వ్యాధులను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే ఏ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటుందో.. ఆ ఇంట్లో శనీశ్వరుడు ఉండడు అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టాలు కూడా ఉండవని, ఇంట్లో డబ్బుకు లోటు ఉందని చెబుతారు. సరిగ్గా కలిసి వస్తే పట్టిందల్లా బంగారం అని అంటారు. తమలపాకు తీగ ఇంట్లో ఉండటం వల్ల సాక్షాత్తూ లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి ఇంట్లో ఉన్నట్టేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
ఈ మొక్క ఏపుగా చక్కగా పెరిగితే.. అప్పుల బాధలు ఉండవని కూడా చెబుతారు. అంతే కాకుండా బుధగ్రహం అనుకూలంగా వుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.