సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (21:01 IST)

ఐఏఎస్ ఆమ్రపాలిపై తెలంగాణ సర్కారుకు ఎందుకో అంత ప్రేమ?

Amrapali Kata
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రేమ, శ్రద్ధ చూపిస్తుంది. ఆమెకు ఏకంగా ఐదు కీలక బాధ్యతలను అప్పగించేసింది. రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ ఆమెకు ఐదు కీలక పోస్టుల (బాధ్యతలు)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అప్పగించింది. 
 
ఇందులో జీహెచ్ఎంసీ కమిషనర్, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్.జి.సి.ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్ వంటి కీలక బాధ్యతలను అప్పగించారు. ఆమ్రపాలి కంటే ఎంతో మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండగా 2010 బ్యాచ్‌కు ఆమ్రపాలికి ఐదు పోస్టులు ఎందుకు ఇచ్చారంటూ పలువురు ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు.