Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మంగళవారం (22-05-2018).. ఆపద సమయంలో ఆత్మీయులు...

మేషం: విద్యార్థినులు ప్రేమ, అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆపదసమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్థిరాస్తి కొనుగో

Written By raman
Updated: మంగళవారం, 22 మే 2018 (08:13 IST)
మేషం: విద్యార్థినులు ప్రేమ, అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆపదసమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం: రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. జాయింట్ వెంచర్లు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.
 
మిథునం: రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్థిరచరాస్తుల ద్వారా ధనం అందుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, విశ్రాంతిలోపం వంటి చికాకులు అధికమవుతాయి.
 
కర్కాటకం: గృహం ఏర్పరచుకోవాలనే కోరిక బలపడుతుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, కార్మికులతో చికాకులు వంటివి ఎదుర్కుంటారు. సేవ, పుణ్యా కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. భార్యాభర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు.
 
సింహం: ఉద్యోగ విరమణ చేసే వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్త్రీలకు అలంకారాలు, అలంకరణల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పుతో పనిచేయవలసి ఉంటుంది. స్త్రీలు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలించవు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. 
 
కన్య: వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రైవేటు సంస్ధలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. పెద్దమెుత్తంలో ధనసహాయం, హామీల వంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
తుల: సిమెంటు, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి. భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కోవలసివస్తుంది. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు సమస్యలకు దారితీస్తాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆందోళన, చికాకులు తప్పవు.   
 
వృశ్చికం: పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ధనసహాయం, హామీల విషయంలో పురాలోచన అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు: స్త్రీలకు ఆత్మీయులు అండగా నిలుస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు అనుకూలిస్తాయి. పుణ్య, సేవా శుభకార్యాల్లో పాల్గొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరగలదు. సాహస ప్రయత్నాలు విరమించండి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం ఉత్తమమని గమినించండి.   
 
మకరం: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మెుండి బాకీలు వసూళ్లు కాగలవు. వృత్తి వ్యాపారులకు ఆశాజనకం. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత, జాప్యం వంటి చికాకులు తప్పవు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
కుంభం: దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది. కీలకమైన వ్యవహారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి. 
 
మీనం: సన్నిహితులు మీ యత్నాలకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.

అన్నీ చూడండి

విశాఖపట్నంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఐటీఐలు.. నారా లోకేష్

హైదరాబాద్ నగర వాసులను వణికిస్తున్న వైరస్...

పింప్రి చించ్వాడ్ శివాలయంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం, సిసిటీవీలో రికార్డ్

సింగపూర్ తరహా వ్యవసాయ విధానం కావాలి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Mantralayam: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి..? (video)

అన్నీ చూడండి

12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్‌లు, సమాచార కేంద్రాల ఏర్పాటు

10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది

తర్వాతి కథనం
Show comments