శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (08:42 IST)

28-03-2019 గురువారం దినఫలాలు - సింహరాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

మేషం: కుటుంబంలో స్వల్ప చికాకులు ఎదురైనా క్రమేణా పరిస్థితులు చక్కబడుతాయి. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తుంది.
 
వృషభం: పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. అవివాహితులకు అందిన ఒక సమాచారం వారిని సందిగ్ధంలో పడవేస్తుంది. నిరుద్యోగుల ఆలోచనులు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది.
 
మిధునం: లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, నిత్యావసరవస్తు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వలన పై అధికారులతో మాటపడవలసివస్తుంది. చేపట్టిన పనులలో చికాకులు, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం.
 
కర్కాటకం: పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీ సంతానం ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ధనవ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి.
 
సింహం: ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించకుండాపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం, శ్రమాధిక్యత తప్పవు. స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వలన కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు.
 
కన్య: ఉద్యోగస్తులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. స్త్రీలకు ఉదరం, దంతాలు, నడుము, మోకాళ్ళకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం. ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. 
 
తుల: హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. స్త్రీలకు రచనలు, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది.
 
వృశ్చికం: శ్రమాధిక్యత, అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఊహించని ఖర్చులు, వాయిదాల చెల్లింపుల వలన ఒకింత ఒడిదుడుకులు తప్పవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. బంధుమిత్రుల నుండి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. ప్రత్యర్థులు మీ శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తారు. 
 
ధనస్సు: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. స్త్రీలకు విలాసాలు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త సమస్యలెదరయ్యే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. స్టాక్ మార్కెట్ రంగాలవారికి అంచనాలు ఫలించవు. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 
 
మకరం: ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధుమిత్రులకు హామీ ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కుంభం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరగగలదు. 
 
మీనం: రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో సంబంధం లేకుండా మీ పనిలో మీరు నిమగ్నులవుతారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది.