బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (09:57 IST)

27-03-2019 - బుధవారం మీ రాశిఫలితాలు - నిరుద్యోగులకు కలిసిరాగలదు...

మేషం: ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం సంతోషాన్నిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు అభివృద్ధి పొందుతారు.
 
వృషభం: విద్యుత్, ఎలక్ట్రానిక్ రంగాలలో వారు అవహేళన ఎదుర్కొనవలసివస్తుంది. స్త్రీలకు తల, పొట్టకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు అధిక కృషి చేసిన జయం చేకూరును. ప్రముఖుల కోసం షాపింగ్ చేస్తారు. ఫైనాన్స్, చిట్‌ఫండ్, మేకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది.
 
మిధునం: రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ యత్నాలు త్వరలోనే ఫలిస్తాయి. వస్త్రం, బంగారు, వెండి రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. నిరుద్యోగులకు కలిసిరాగలదు.
 
కర్కాటకం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. మీ దార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి.
 
సింహం: ఆర్థికలావాదేవీలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులు పనిలో ఉండే ఒత్తిడి తగ్గి ప్రశాంతతను పొందుతారు. కుటుంబీకులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన నిర్ణయాలు చేయు విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. స్త్రీలకు తల, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
 
కన్య: రావలసిన మొండిబాకీలు సైతం వసూలుకాగలవు. మీ సోదరీ మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడుతాయి. ఎప్పటి నుండో మీరు అనుకుంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గరపడుతుంది. 
 
తుల: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. కిరాణా, వస్త్ర వ్యాపారులు అధిక ఒత్తిడిని ఎదుర్కుంటారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు.
 
వృశ్చికం: కోర్టు వ్యవహారాలలో మెళకువగా వ్యవహరించడం మంచిది. అనుకోకుండా పరిచయమయిన ఒక కొత్త వ్యక్తితో బంధం ముడిపడి, జీవిత భాగస్వామిగా మార్చవచ్చు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన భంగపాటుకు గురవుతారు. 
 
ధనస్సు: మీ సంతానం కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. 
 
మకరం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారాలకు బాగుగా కలిసివస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. 
 
కుంభం: ధనం నిల్వ చేయాలనే మీ సంకల్పం నెరవేరదు. గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలుచేస్తారు. దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యక్తుల కలయిక వలన మీలో ఉత్సాహం కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 
 
మీనం: పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. బంధువుల రాకతో ఖర్చులు మీ అంచనాలను మించుతాయి. పీచు, నార, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు మందకొడిగా ఉండును. దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.