బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (09:10 IST)

26-03-2019 మంగళవారం దినఫలాలు - వృషభం రాశివారు అలా చేయడం వల్ల...

మేషం: గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు అనుకూలిస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో అలంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారంలో పెరిగిన పోటీ వాతావరణం ఆందోళన కలిగిస్తుంది.
 
వృషభం: ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. బ్యాంకు లావాదేవీలు, దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
మిధునం: ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. బంధువులను కలుసుకుంటారు. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. విద్యార్థినులకు భయాందోళనలు అధికమవుతాయి. సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతారు.
 
కర్కాటకం: నిరుద్యోగులు వచ్చిన అవకాశం చేజార్చుకోవడం మంచిది కాదని గమనించండి. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని వ్యవహారాలు మీకు లభిస్తాయి. ఉన్నతస్థాయి అధికారులు మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది.
 
సింహం: కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ శాఖతో అవగాహన లోపిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు లభిస్తాయి. ఆడిటర్లకు అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది.
 
కన్య: ప్రైవేటు, రిప్రజెంటేటివ్‌ల సంస్థల్లోని వారు మార్పులకై చేయు యత్నాలు వాయిదా పడుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరచిత వ్యక్తలు పట్ల మెళకువ అవసరం. మీరెదురు చూస్తున్న అవకాశం అసంకల్పితంగా మీ చెంతకే వస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. 
 
తుల: కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కుంటారు. భార్యా, భర్తల మధ్య విబేధాలు తలెత్తవచ్చు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువులరాకతో అనుకోని కొన్ని ఖర్చులు మీద పడుతాయి. ఉద్యోగస్తులు తొందరపడి సంభాషించడం వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. 
 
వృశ్చికం: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైలే, మెకానికల్ రంగాలవారికి చికాకులు తప్పవు. సన్నిహితులతో కలిసి సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి.
 
ధనస్సు: విదేశీయానం కోసం చేసే యత్నాలు అడ్డంకులు తొలగిపోగలవు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వలన పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మకరం: ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన కుటుంబీకులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదని గమనించండి. ఖర్చులు అధికం కావడంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. నిరుద్యోగులకు ఆశాజనకం. 
 
కుంభం: ఉపాధ్యాయులు విద్యార్థులను నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 
 
మీనం: కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.