శుభోదయం : మీ రాశి ఫలితాలు 30-08-17

మేషం: ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. మీ సంతానం ఉన్నతి కోసం కొత్తకొ

Written By raman
Updated: బుధవారం, 30 ఆగస్టు 2017 (05:49 IST)
మేషం: ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. మీ సంతానం ఉన్నతి కోసం కొత్తకొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు.  
 
వృషభం: ఈ రోజు స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. కుటుంబీకులు, దంపతుల కొత్తకొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఊహించని ఖర్చులు, సమయానికి ధనం అందక పోవడం వల్ల ఆటుపోట్లు తప్పవు. 
 
మిధునం: ఈ రోజు దైవకార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. 
 
కర్కాటకం: ఈ రోజు గృహోపకరణాలు అమర్చుకుంటారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. బంధువులు మీ ఉన్నతిని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. క్రయవిక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రముఖుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
సింహం: ఈ రోజు ఉన్నత చదువుల గురించి విద్యార్థులు ఒక నిర్ణయానికి వస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు శ్రమాధిక్యత ఎదుర్కోవలసి వస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం వల్ల బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవు. చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమఫలితం. 
 
కన్య: ఈ రోజు గతంలో నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. వ్యాపారాభివృద్దికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రతి విషయంలోనూ శాంతియుతంగా వ్యవహరించాలి. 
 
తుల: ఈ రోజు పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకు వహించండి. 
 
వృశ్చికం: ఈ రోజు ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. నూతన పెట్టుబడులకు మరి కొంతకాలం వేచియుండటం శ్రేయస్కరం. స్థిరాస్తి క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సహోద్యోగులతో సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. 
 
ధనుస్సు: ఈ రోజు స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. దైవ కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. 
 
మకరం: ఈ రోజు వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఎదుటివారికి మీ మాటపై నమ్మకం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. తరచూ దైవకార్యాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టు వ్యవహారంలో పునరాలోచన అవసరం. మీ మాటతీరును ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. 
 
కుంభం: ఈ రోజు అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ విలువైన వస్తువు విషయంలో మెలకువ వహించండి. స్త్రీలకు సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. గృహమరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. 
 
మీనం: ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మీ యత్నాలకు సన్నిహితులకు తోడ్పాటు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, చల్లని పానీయ చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కొంతమంది మిమ్మలను పట్టించేందుకు యత్నిస్తారు.

అన్నీ చూడండి

ఆస్ట్రేలియా బాండీ బీచ్‌ కాల్పుల ఘటన హీరోకు సిడ్నీలో శాశ్వత నివాసం

ఏపీలో కొత్తగా ఏడు కోవిడ్ కేసులు.. 26కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఇందిరమ్మ గృహాలకు ఆధార్ లింక్ తప్పనిసరి : తెలంగాణ సర్కార్ ఆదేశం

భార్య, పిల్లల నోటికి ప్లాస్టర్ అంటించి గొంతునులిమి హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా..

ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నం

అన్నీ చూడండి

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments