Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు(14-07-2017)... మంచి అవకాశాలు లభిస్తాయి...

మేషం : స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్త

Written By Raman
Updated: గురువారం, 13 జులై 2017 (23:17 IST)
మేషం : స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు.
 
వృషభం : రచయితలకు, పత్రికా రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. గతంలోని వ్యక్తులు తారసపడతారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి.
 
మిథునం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. విద్యాసంస్థల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వహించండి. 
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతి లభించదు. బంధువుల ఆకస్మిక రాకతో మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. గృహ మరమ్మతులు, నిర్మాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పరిచయాలు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో ఆటంకాలను అధికమిస్తారు.
 
సింహం : వృత్తి పనులు కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. మీరు ప్రేమించే వారి వల్ల కొంత నష్టపోయే ఆస్కారం ఉంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది.
 
కన్య : పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. బంధువుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణాల్లో అపరిచితుల పట్ల మెళకువ అవసరం.
 
తుల : అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలుంటాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా పూర్తికాగలవు.
 
వృశ్చికం : ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య అనుబంధాలు బలపడతాయి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం.
 
ధనుస్సు : పారిశ్రామిక రంగంలో వారికి ప్రతికూల వాతావరణం నెలకొని ఉంటుంది. ఒక ప్రకటన మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం విషయంలో ఏకాగ్రత వహించగలుగుతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం.
 
మకరం: వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి అవకాశాలు లభిస్తాయి. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. మిత్రుల కలయికతో ప్రశాంతతను పొందుతారు. కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది.
 
కుంభం : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మీనం : డాక్టర్లు శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పత్రిక, వార్తా మీడియా వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. రావలసిన ధనం గురించి ఆలోచనలు చేస్తారు. మీ అభిప్రాయాలు, భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. వాతావరణంలో మార్పుతో స్వల్ప అస్వస్థతకు గురవుతారు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో జరిగిన అమెజాన్ వార్షిక సమావేశంలో మీర్జాపూర్ తారల సందడి

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. గర్భిణీ మహిళ ఆత్మహత్య

First baby girl in 200 years: 200 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ.. పండగ చేసుకున్నారు..

Sabarimala Gold Case: శబరిమలలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు బెయిల్

కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్

అన్నీ చూడండి

03-09-2026 గురువారం రాశి ఫలితాలు... కొత్త ప్రాజెక్ట్‌కు అనుకూలమైన రోజు

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

Krishna Jayanti 2026 Significance : శ్రీకృష్ణ జయంతి పూజ.. కృష్ణుని జననానికి ఆధారాలు ఉన్నాయా?

Tirumala: సర్వ దర్శన్ టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ

02-09-2026 బుధవారం రాశి ఫలితాలు... సమయపాలన అవసరం

తర్వాతి కథనం
Show comments