శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (12:21 IST)

వీపు భాగంపై నల్ల మచ్చ గలవారికి..?

మచ్చ అనగా అందం, ఆరోగ్యం వంటి వాటికి సంకేతాలని చెప్పవచ్చు. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం... వీపు, వెన్ను మీద మచ్చ వున్నచో కలిగే ఫలితాలను తెలుసుకుందాం..
 
వెన్ను మీద పుట్టుమచ్చ చాలా యోగదాయకమైనది. ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ గలవారు రాజకీయలలో రాణిస్తారు. ప్రజలచే మన్ననలను పొందుతారు. కీర్తివంతుడై ఉంటాడు. అలానే వీపు మీద మచ్చ ఉన్నచో ఆ వ్యక్తి మంచి ఆరోగ్యం కలవాడై ఉంటారు. బలిష్ఠుడు అగును. వీపు ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. తలచిన కార్యాలు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. 
 
వీపుకు కుడి భాగంలో మచ్చ ఉన్నచో.. వారు సోమరితనంగా ఉంటారు. స్వతంత్రించి ఏ కార్యాన్ని చేయలేనివాడవుతాడు. వెన్నుమీద మూలస్థామున పుట్టుమచ్చ ఉంటే.. వారికి దీర్ఘాయుష్శంతుడవుతారు. దైవరాధనలో మంచి భక్తి గలవారు.

మొత్తం మీద వీపు మీద పుట్టుమచ్చ ఉన్నవారు.. మంచి ప్రవర్తనగలవాడు, సమస్తసంపదలతో తులతూగువాడు, విద్వాంసుడు, దైవభక్తి గలవాడు. అంతేకాదు, మంచి ప్రవర్తన కలవాడై సామాన్యుడై ఉంటాడు. ఒకవేళ ఆ మచ్చ నల్లగా ఉన్నచో దుష్టప్రవర్తన కలవాడై, ధనం అంతయు పోగొట్టుకొనువాడు, మధ్యమాయుర్దావంతుడవుతాడు.