శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: సోమవారం, 31 డిశెంబరు 2018 (18:13 IST)

01-01-2019 నుండి 31-01-2019 వరకు మీ మాస రాశి ఫలితాలు(Video)

1వ తేదీ బుధుడు ధనస్సు నందు, 1వ తేదీ శుక్రుడు వృశ్చికం నందు, 14వ తేదీ రవి మకరం నందు, 20వ తేదీ బుధుడు మకరం నందు, 29వ తేదీ శుక్రుడు ధనస్సు నందు ప్రవేశం. 4వ తేదీ మాసశివరాత్రి, 7వ తేదీ చంద్రదర్శనం, 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రాంతి, 16వ తేదీ కనుమ, 17వ తేదీ ముక్కనుమ, సావిత్రి గౌరీవ్రతం, 19వ తేదీ శని త్రయోదశి. వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారి శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది.
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ద్వితీయార్ణం ఆశాజనకం. ఖర్చులు విపరీతం. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులకు శుభాకాంక్షలు తెలియజేశ్తారు. పదవులు దక్కకపోవచ్చు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. వేడుకలకు సన్నాహులు సాగిస్తారు. దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయ. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. ప్రయాణంలో అవస్థలు తప్పవు. 
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. స్త్రీల కళాత్మతకు ప్రోత్సాహం ఉంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. అనుకోని సంఘటనలెదురవుతాయి. పదవులు, బాధ్యతల నుండి తప్పుకుంటారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాగ్ధాటితో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడుతాయి. పందాలా, పోటీల్లో విజయం సాధిస్తారు. వాహన చోదకులకు దూకుడు తగదు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. 
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు విపతీరం. చేతిలో ధనం నిలవదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగాలి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. జూదాలు, పందాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు.  
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం యోగదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉన్నత పదవులు అందుకుంటారు. బాధ్యతలు పెంపొందుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాధిస్తారు. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు కొత్త మలుపు తిరుగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. పోటీలు, పందాల్లో విజయం సాధిస్తారు.
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులకు అంతుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తంది. పదవులు, పురస్కారాలు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకలకు హాజరవుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. పెట్టుబడులకు తగిన సమయం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పొదుపు మూలక ధనం అందుతుంది. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. అసాధ్యమనుకన్న పనులు తేలికగా పూర్తవుతాయి. వివాదులు సద్దుమణుగుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రీడాపోటీల్లో పాల్కొంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. వాహన చోదకులకు దూకుడు తగదు.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం. అనురాధ, జ్యేష్ట
కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. గృహమార్పు అనివార్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడుతారు. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. పదవులు కోసం యత్నాలు సాగిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడుతారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సహాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. పెట్టుబడులకు అనుకూలం కాదు. వేడుకలకు యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రియతములో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితులెదరవుతాయి. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. ప్రయాణం, దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. సంప్రదింపులు అనుకూలం. ఆదాయం బాగుంటుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులు కృషి ఫలిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాుల, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధ్యాయులు శ్రమ ఫలిస్తుంది. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. చిన్నతరహా పరశ్రమలకు ప్రోత్సాహకరం. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. ప్రయాణంలో జాగ్రత్త. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం శుభదాయకం. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవివాహితుల ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యం సంతృప్తికరం. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. పెట్టుబడులు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ధనయోగం, పదోన్నతి. దైవదర్శనం సంతృప్తినిస్తుంది. క్రీడా పోటీల్లో రాణిస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం. వీడియోలో చూడండి...