శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (16:58 IST)

ధనుస్సు రాశిలో పుట్టిన వారు ఇలా వుంటారు.. నలుపు రంగుతో..?

ధనుస్సు రాశిలో జన్మించిన జాతకులు పెద్దల యందు వినయవిధేయతలు కలిగి ఉండటం బాధ్యతగా భావించే ఈ జాతకులు అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఎలాంటి పనిచేయరు. న్యాయానికి, ధర్మానికి పెద్దపీట వేస్తారు. ఆత్మీయుల ప్రతిభాపాటవాలను గుర్తించి వారి రాణింపుకు చేయూతనిస్తారు. దాన, ధర్మాలు అధికంగా చేస్తారు. అలాగే వీరికి అందే సహకారాలు కూడా గొప్పగానే ఉంటాయి. 
 
ఇంకా చెప్పాలంటే.. అందరూ ప్రధానంగా భావించే డబ్బుకోసం తాపత్రయపడరు. పేరు ప్రతిష్టలకు, వృత్తిలో రాణింపుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. జ్యేష్ట సంతానం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరపడటం మంచిది. ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెబుతారు. అయితే ఏ విషయంలోనూ అతి జోక్యం ఉండదు. 
 
మీ మాటకు ధిక్కరించిన వారిని జీవితాంతం శత్రువులుగానే చూస్తారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయ బంధువర్గం వలన పరువు-ప్రతిష్టలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దాదాపుగా అందరికీ మంచి చేసే వీరు.. శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విబేధాలు కొందరికి సంప్రాప్తిస్తాయి. 
 
అందుచేత ప్రతిరోజూ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మేలు కలిగిస్తుంది. ఇంకా ఇబ్బందుల నుండి, ఈతిబాధల నుండి బయటపడాలంటే.. ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం శుభ ఫలితాలనిస్తుంది.
 
ఇక వీరి అదృష్ట సంఖ్య-3. అలాగే 3, 12, 21 వంటి సంఖ్యలు ధనుస్సు రాశి జాతకులకు సాధారణ ఫలితాలనిస్తాయి. అయితే 5, 6 సంఖ్యలు వీరికి అనుకూలించవు. నలుపు, సిల్వర్, పచ్చ రంగులు వీరికి అన్ని విధాలా కలిసిరాగలవు. 
 
ఇందులో నలుపు రంగుతో కూడిన రుమాలును ఎప్పుడూ చేతిలో ఉంచుకుంటే.. సత్ఫలితాలు చేకూరుతాయి. ఇంకా వీరికి బుధవారం అదృష్టమైన రోజు. ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం, శనివారాలు వీరికి అనుకూలించవు.