శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 29 డిశెంబరు 2018 (22:20 IST)

మీన రాశి 2019... ఆలస్యం అమృతం... (Video)

మీనం: ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా చతుర్థము నందు రాహువు, రాజ్యము నందు కేతువు. 2020 ఫిబ్రవరి వరకు రాజ్యము నందు శని, ఆ తదుపరి అంతా లాభము నందు, నవంబర్ 4వ తేదీ వరకు భాగ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా, రాజ్యము నందు సంచరిస్తారు.
 
ఈ రాశివారికి గ్రహసంచారం పరిశీలించగా 'ఆలస్యం అమృతమ్ విషమ్' అన్నట్లుగా ప్రతి చిన్న అవకాశాన్ని విడవక, సద్వినియోగం చేసుకోండి. కుటుంబ విషయాల్లో కొంత అనుకూలంగా ఉన్న ఎక్కువభాగం బంధుమిత్రులతో, కుటుంబీకులతో కలహ వాతావరణం నెలకొనే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల యందు అధిక జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలు ఇతరుల మద్ద చర్చించకుండా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఖర్చులు కూడా నియంత్రించుకోగలుగుతారు. అదేరీతిలో అవసరానికి తగిన కొత్త ఋణములు, ఆర్థిక వెసులుబాటు చక్కగా లభిస్తాయి. 
 
శని, గురువులు అనుకూలంగా ఉన్న దృష్ట్యా కష్టేఫలి అన్నట్లుగా మీరు శ్రమిస్తున్న కొద్దీ దానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. నూతన దంపతులు శుభవార్తలు వింటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ విషయాల యందు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రమోషన్‌కై చేయు యత్నాలు ఫలిస్తాయి. తోటి ఉద్యోగుల సహాయ సహకారులు మీకు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుకుడులు ఉన్నప్పటికి మంచి లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించనప్పటిక నెట్టుకు రాగలుగుతారు.
 
మీ శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. బంధుమిత్రుల సహాయ, సహకారాలు అందుకుంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి శుభకాలం. నూతన ఉగ్యోగ యత్నాలు ఒక కొలిక్కిగాలవు. విలువైన వస్తు, వాహనాలను అమర్చుకుంటారు విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. క్యాంపస్ సెలక్షన్ ద్వారా అరుదైన అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఒకడుగు ముందుకు వేస్తారు. మీ ప్రయత్నాల్లా సఫలీకృతులౌతారని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. విదేశీయాన యత్నాలు చేయువారు వారికి అధిక ప్రయాస, ధనవ్యయం అయినప్పటికి చివరికి పనులు సానుకూలమవుతాయి. 
 
రైతులు పంటల విషయంలో గానీ, విత్తనాల విషయంలో గానీ తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. మోసపోయే ఆస్కారం ఉంది. వాతావరణం కూడా అనకూలించడంతో అనుకున్న లాభం పొందగలుగుతారు. వస్త్ర, బంగారం, వెండి రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. గురు, శని సంచారం అనుకూలం దృష్ట్యా వర్క్‌ర్స్‌తో సహకారం మీకు బాగా అందుతుంది. సాంఘిక, సేవా కార్యక్రమాలకు సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తుంది. నూతన పరిచయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అవివాహితుల్లో నూతన ఉత్సాహం నెలకొంటుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో అనుకోని పురోభివృద్ధి కానవస్తుంది. పుణ్యకార్యాలు, దైవదర్శనాలు చేసుకుంటారు. మనోవ్యాకులతకు దూరంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకున్నట్లైతే ఈ సంవత్సరం ఈ రాశివారు ఉత్తమ ఫలితాలు పొందే ఆస్కారం ఉంది.  
 
* ఈ రాశివారు కార్తీకేయును ఎర్రని పూలతో పూజించి, ఆదిత్య హృదయం ప్రతిరోజూ పఠించిన సంకల్పసిద్ధి, మనోవాంఛలు నెరవేరగలవు.
* పూర్వాభాద్ర నక్షత్రం వారు కనపుష్యరాగం, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు పుష్యనీలం, రేవతి నక్షత్రం వారు గరుడపచ్చ ధరించిన శుభం కలుగుతుంది.
* పూర్వాబాద్ర నక్షత్రం వారు మామిడి ఉత్తరాభాద్ర వారు వేప రేవతి నక్షత్రం వారు విప్పను నాటిన పురోభివృద్ధి పొందుతారు. వీడియో చూడండి..