గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : గురువారం, 31 మే 2018 (22:49 IST)

జూన్ 1 నుంచి 30 జూన్ 2018 వరకు మీ రాశి ఫలితాలు(Video)

8వ తేదీ శుక్రుడు కర్కాటకం నందు, 10వ తేదీ బుధుడు, కుజుడు, 15వ తేదీ రవి మిధునం నందు ప్రవేశం. 25వ తేదీ బుధుడు కర్కాటకం నందు ప్రవేశం. 26వ తేదీ నుండి కుజునికి వక్రం ప్రారంభం. 2వ తేదీ సంకటహర చతుర్థి, 10వ తే

8వ తేదీ శుక్రుడు కర్కాటకం నందు, 10వ తేదీ బుధుడు, కుజుడు, 15వ తేదీ రవి మిధునం నందు ప్రవేశం. 25వ తేదీ బుధుడు కర్కాటకం నందు ప్రవేశం. 26వ తేదీ నుండి కుజునికి వక్రం ప్రారంభం. 2వ తేదీ సంకటహర చతుర్థి, 10వ తేదీ మతత్రయ ఏకాదశి, 12వ తేదీ మాసశివరాత్రి, 15వ తేదీ బుద్ధ జయంతి, 23వ తేదీ సార్థ ఏకాదశి, 28వ తేదీ ఏరువాక పూర్ణిమ. 14వ తేదీ నుండి నిజజ్యేష్ఠ మాసం ప్రారంభం.
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం అనుకూలదాయకమే. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. దంపతుల కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఆహ్వానం, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు భారం కావు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. భేషజాలు, మెుహమాటాలకు పోవద్దు. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. గృహమార్పు అనివార్యం. అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఊహించని సంఘటలెదురవుతాయి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. పొదుపు మూలంగా ధనం అందుతుంది. విలాస వస్తువులు అమర్చుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులకు అనుకూలత ఉంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వేడుకలకు హాజరవుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. అధికారులకు హోదా మార్పు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. సంస్థల స్థాపనకు వనరులు సర్దుబాటవుతాయి. విద్యార్థులకు దూకుడు తగదు.
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. దంపతుల మధ్య సఖ్యతాలోపం. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒత్తిడి, ఆందోళన అధికం. పనులు సాగక విసుగు చెందుతారు. యత్నాలు విరమించుకోవద్దు. త్వరలో శుభవార్త వింటారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పెద్దల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆశాజనకం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో జాగ్రత్త.
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆర్థికలావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం ఉంది. రుణ విముక్తులవుతారు. విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆదాయం సంతృప్తికరం. పెట్టుబడులు, పొదుపు పథకాలు లభిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉపాధ్యాయులకు పదోన్నతి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సాంకేతిక, వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆహ్వనం అందుకుంటారు. కీలక పత్రాలు జాగ్రత్త. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానానికి ఉన్నత విద్యవకాశం లభిస్తాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పనిభారం. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లే మితంగా ఉండాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ కాగలవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వివాదాలు కొలిక్కివస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు దూకుడు తగదు. 
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రారంభంలో ప్రతికూలతలు అధికం. ప్రముఖుల కలయిక వల్ల ప్రయోజనం శూన్యం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అవసరాలకు ధనం అందకపోవచ్చు. ఖర్చులు విపరీతం. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. విలువైన పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయాణం తలపెడతారు.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఏమంత స్పందన ఉండదు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వ్యవహారాల్లో ప్రతికూలతలుంటాయి. అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనాలోచిత నిర్ణయాలు తగదు. సన్నిహితుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు రుణాల కోసం యత్నాలు సాగిస్తారు. అవసరాలు, చెల్లింపులు వాయిదా పడతాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు అధికారుల తీరు ఆందోళన కలిగిస్తుంది. సహోద్యోగులతో జాగ్రత్త. వృత్తుల వారికి సామాన్యం. పందాలు, జూదాలకు దూరంగా ఉండాలి.
 
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరషాడ 1వ పాదం
ప్రేమానుబంధాలు బలపడతాయి. పరిచయం లేనివారితో జాగ్రత్త. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలనిస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలజీవి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తరషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. కష్టానికి ప్రతిఫలం అందుతుంది. ఆత్మీయులకు చక్కని సలహానిస్తారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. గృహనిర్మాణాలు వేగవంతమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ప్రత్యర్థుల తీరును గమనించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. సోదరీసోదరులతో అకారణ కలహం. మీ ఆవేశం తగ్గించుకోవాలి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. ఆత్మీయుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. చాలని ఆదాయంతో సతమతమవుతారు. గృహమార్పు నిదానంగా కలిసివస్తుంది. కొన్ని అవకాశాలను వదులుకోవలసి వస్తుంది. పరిచయస్తుల కలయిక వల్ల ప్రయోజనం ఉండదు. సంతానానికి ఆలస్యంగా ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మీనం: పూర్వబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధుత్వాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఆదాయం బాగుటుంది. రుణయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యం చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పెద్దల సలహా తీసుకోండి పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.