Daily Horoscope
✕

కన్యారాశి జాతకులు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారట..

వృషభం, కర్కాటకం, కన్యారాశి, ధనుస్సు, మీనరాశి జాతకులు ప్రేమ వ్యవహారాలతో పాటు వివాహాలపై అధికంగా ఆసక్తి చూపుతారు. ఇందులో వృషభ రాశి జాతకులు ప్రేమించిన వారినే జీవిత భాగస్వామిగా మార్చుకుంటారు. కన్యారాశి జాత

Written By Selvi
Updated: శుక్రవారం, 24 మార్చి 2017 (14:51 IST)
జ్యోతిష్క్యానికి సంబంధించినంతవరకు ఒక్కో రాశికి ప్రత్యేకత ఉంది. మనుషుల అలవాట్లకు రాశులకు సంబంధం ఉందని జ్యోతిష్కులు అంటున్నారు. మనిషి స్వభావం రాశులను బట్టి మారుతూ వుంటుంది. స్వభావం, అలవాట్లు, వివాహ సంబంధాలు వంటి ఇతరత్రా అంశాలు రాశులకు ముడిపడివుంటాయి. అలా ఏ రాశిలో జన్మించిన వారు ప్రేమ వివాహం చేసుకుంటారని తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథనం చదవండి.
 
వృషభం, కర్కాటకం, కన్యారాశి, ధనుస్సు, మీనరాశి జాతకులు ప్రేమ వ్యవహారాలతో పాటు వివాహాలపై అధికంగా ఆసక్తి చూపుతారు. ఇందులో వృషభ రాశి జాతకులు ప్రేమించిన వారినే జీవిత భాగస్వామిగా మార్చుకుంటారు. కన్యారాశి జాతకులు మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. అంటే కన్యారాశి జాతకులు ప్రేమ ఫలించినా.. ఆపై భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారని జ్యోతిష్కులు అంటున్నారు. 
 
ప్రేమించడం.. ప్రేమికులకు సహకరించడం వంటి పనుల్లో వృషభం, కర్కాటకం, కన్యారాశి, ధనుస్సు, మీనరాశి జాతకులు ముందుంటారు. అయితే ఈ జాతకులు ప్రేమలో సఫలం అవుతారా? విఫలం అవుతారా? అనే విషయం మాత్రం వారి వారి సొంత జాతకాలను పరిశీలించే చెప్పగలమని జ్యోతిష్కులు అంటున్నారు. సాధారణంగా ఒకరి జాతకంలో శుక్ర దశ అనుకూలంగా ఉంటే.. ప్రేమించిన వారినే పెళ్లాడుతారు. 
 
అయితే శుక్రదశ నీచంగా ఉంటే మాత్రం ప్రేమలో విఫలం తప్పదు. ఒకవేళ వివాహం జరిగినా విడాకులు, మనస్పర్ధలకు దారితీస్తుంది. సాధారణంగా ఏ లగ్నమైనా, రాశి అయినా కళత్ర స్థానం అనే 7, 8 స్థానాలను బట్టే వివాహ జీవితం ఉంటుంది. ఒకరికి  7, 8 స్థానాలు సక్రమంగా ఉంటే.. పాప గ్రహాల దృష్టి ప్రభావం లేకుంటే వారికి పెద్దలు కుదిర్చే వివాహం జరుగుతుంది. అదే కళత్ర స్థానం, పూర్వ పుణ్య స్థానం రెండూ బలంగా ఉంటే సన్నిహితులు, బంధువులతో వివాహం కుదురుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

ఇంట్లోకి చొరబడిన దుండగులు.. కుటుంబంపై దాడి.. మహిళ మృతి.. ఇద్దరు కుమార్తెలు అదృశ్యం

సైనికుల మృతదేహాలను దయనీయస్థితిలో వదిలేస్తే మేమే అంత్యక్రియలు చేశాం : పాక్‌కు భారత్ కౌంటర్

కృష్ణా ఎక్స్‌ప్రెస్ B4 బోగీ నుంచి పొగలు... ఎర్ర జెండా ఊపి..?

బంగాళాఖాతంలో అల్పపీడనం - సోమవారానికి తుఫానుగా బలపడే ఛాన్స్

ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య, ఇద్దరూ కలిసి పరార్

అన్నీ చూడండి

ఏడు జన్మల పాపాలను, కర్మలను తొలగించే శివ నామాల గురించి తెలుసా?

శుక్ర ప్రదోష వ్రతం.. శివుని అభిషేకాన్ని దర్శిస్తే.. ఏంటి ఫలితం?

23-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - వృత్తిపరంగా కొత్త అవకాశం రావచ్చు..

22-10-2026 గురువారం దిన ఫలాలు - సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితం...

శిశువు మెడలో పేగు వేసుకుని జన్మిస్తే...?

తర్వాతి కథనం
Show comments