ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (10:23 IST)

పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే?

పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆయన్ని స్మరిస్తే.. సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. ఐదు ముఖాలతో వుండే హనుమంతుని ఒక్కో ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది. ఆంజనేయుడి మ

పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆయన్ని స్మరిస్తే.. సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. ఐదు ముఖాలతో వుండే హనుమంతుని ఒక్కో ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది. ఆంజనేయుడి ముఖం ప్రధానంగా ఉంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. అలాగే మిగిలిన ముఖాలలో నారసింహునికి అభీష్టసిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది. 
 
కుడివైపు చివరన వుండే వరహా ముఖం దానప్రపత్తిని ఎడమవైపు చివరన వుండే హయగ్రీవ ముఖం సర్వవిద్యలను కలుగజేస్తాయి. అందుకనే పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం అన్ని విధాల శుభాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. 
 
పంచముఖ హనుమంతునికి వున్న పదిచేతుల్లోని ఆయుధాలు భక్తులను కాపాడుతాయి. నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తులనుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా.. తుంగభద్ర నదీతీరంలో స్వామి వారి కోసం తపస్సు ఆచరించిన శ్రీరాఘవేంద్రస్వామికి ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇక హనమంతునికి శని, మంగళవారాల్లో తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.