1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Skandha sasti significance

స్కంధ షష్ఠి: ఆరు గంటలకు నేతి దీపం వెలిగించడం ద్వారా?

Lord Muruga
నేడు స్కంధ షష్ఠి. సాయంత్రం ఆరు గంటలకు ఆలయంలో నేతి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అలాగే స్కంధ షష్ఠి రోజున పూజ చేయడం ద్వారా నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. 
 
ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. 
 
ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కన్యారాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి అదృష్టం...