బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (11:30 IST)

రాబిస్ డే 2022.. థీమ్.. ప్రాముఖ్యత ఏంటంటే?

Dog
Dog
రాబిస్ అనేది ప్రాణాంతకమైన కానీ నివారించగల వైరల్ వ్యాధి, ఇది సోకిన జంతువుల లాలాజలం నుండి ప్రజలకు వ్యాపిస్తుంది. ఇది సాధారణంగా వీధికుక్కలు లేదా టీకాలు వేయని కుక్కల నుండి వ్యాపిస్తుంది. వ్యాధి యొక్క లక్షణాలు తలనొప్పి, విపరీతమైన జ్వరం, అధిక లాలాజల పక్షవాతం, మానసిక రుగ్మత, గందరగోళం, చివరికి కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీస్తాయి. 
 
రాబిస్ తీవ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, అవగాహన కల్పించడానికి, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28ని ప్రపంచ రాబిస్ డేగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచ రాబిస్ దినోత్సవం ఆ వ్యాధి గురించి అవగాహన పెంచేందుకు తద్వారా ఈ ప్రాణాంతక వ్యాధిని నిర్మూలించేందుకు ఉపయోగపడుతుంది. 
 
ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త-మైక్రోబయాలజిస్ట్, లూయిస్ పాశ్చర్, రాబిస్ చికిత్స కోసం మొట్టమొదటిసారిగా టీకాను అభివృద్ధి చేశారు. ఈ రసాయన శాస్త్రవేత్త సెప్టెంబరు 28న కన్నుమూశారు. అందువల్ల, అతని గొప్ప సహకారాన్ని గౌరవించేందుకు గాను అతని వర్ధంతిని ప్రపంచ రాబిస్ దినోత్సవంగా జరుపుకోవడానికి ఎంచుకున్నారు. 
 
రాబిస్ డే ఈ ఏడాది థీమ్.. ఆరోగ్యం, జీరో డెత్స్. ప్రపంచంలో మందులు, సాధనాలు, టీకాలున్నాయి. వీటి సహకారంతో రాబిస్ నుంచి 'సున్నా మరణాలు' అంతిమ లక్ష్యం కావాలి. మొట్టమొదటిసారిగా ప్రపంచ రేబిస్ డే ప్రచారం 2007లో జరిగింది.