మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (10:02 IST)

రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాతల పెళ్లి నిజమేనా?

Rocking Rakesh
Rocking Rakesh
జబర్దస్త్ కామెడీ షోలో రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య ఏదో నడుస్తుంది అని చాలా సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది. అయితే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే.. ఎలాంటి రిలేషన్ లేదు అంటూ చాలామంది ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్‌లో కనిపించేదంతా కేవలం రేటింగ్ కోసం ఆడుతున్న నాటకాలు మాత్రమే.. అందులో ఎలాంటి రియాలిటీ ఉండదని చాలామంది చెప్తుంటారు. 
 
కాకపోతే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్‌లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. 
 
అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్‌తో కలిసి స్కిట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే సుజాతతో ఆయన ప్రేమలో పడ్డాడు. 
 
ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటూ తాము కూడా చాలాసార్లు బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎప్పుడు చెప్పలేదు.. కానీ తొలిసారి తన యూట్యూబ్ ఛానల్‌లో రాకింగ్ రాకేష్‌తో పెళ్లి గురించి అధికారికంగా బయట పెట్టింది జబర్దస్త్ సుజాత.
 
రోజా హౌస్ టూర్‌లో భాగంగా మాట్లాడుతూ.. తమ రిలేషన్ గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. త్వరలోనే పెళ్లి గురించి మరిన్ని వివరాలు చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది సుజాత.