శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (15:10 IST)

పూజగది ఇలా వుండాలి.. పటాలు, యంత్రాలు ఆ దిశలో వుంచకూడదట?

పూజగదిని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులలో నిర్మించుకోవచ్చు. పూజ గదిని ఏవైపున నిర్మించుకున్నా.. తూర్పు వైపు చూస్తూ పూజ చేస్తే మంచిది. ఉత్తర దిక్కున దేవతా విగ్రహాలు, ఫోటోలు, యంత్రాలు ఉంచితే దక్షి

పూజగదిని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులలో నిర్మించుకోవచ్చు. పూజ గదిని ఏవైపున నిర్మించుకున్నా.. తూర్పు వైపు చూస్తూ పూజ చేస్తే మంచిది. ఉత్తర దిక్కున దేవతా విగ్రహాలు, ఫోటోలు, యంత్రాలు ఉంచితే దక్షిణ దిక్కును చూస్తాయి కాబట్టి.. ఆ దిక్కుల్లో వాటిని వుంచకూడదు. పడమర తూర్పు ముఖంగా దేవుని పటాలు, విగ్రహాలు, యంత్రాలు ఉంచి కూడా పూజ చేసుకోవచ్చు. 
 
ఆగ్నేయంలో వంటగది పోగా తూర్పు భాగమందు దేవుని గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంకా దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు ముఖంగానే వుంటాయి. కానీ ఈశాన్యంలో మాత్రం పూజగది వుండకూడదు. 
 
పూజ చేసే సమయంలో మాత్రమే ఈశాన్యం దిక్కును తెరచి వుంచి.. మిగిలిన సమయాల్లో మూయడం వల్ల ఈశాన్యం మూతపడి దోషం ఏర్పడుతుంది. అందుచేత ఈశాన్య దిక్కున పూజగది ఏర్పాటు చేయకూడదని.. అలా ఏర్పాటు చేసుకుంటే.. ఎక్కువ సేపు మూత పెట్టి వుంచడం మంచిది కాదని వాస్తునిపుణులు సూచిస్తున్నారు.