శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By TJ
Last Modified: గురువారం, 20 జులై 2017 (14:08 IST)

బీరువాను ఇలా పెడితే సర్వ నాశనమే...!

మనిషి జీవితంలో ముఖ్యమైనది ప్రేమానుబంధాల తరువాత డబ్బే. కొన్ని సంధర్భాల్లో ఈ డబ్బే అనుబంధాలను కూడా మించిపోతుంది. అలాంటి ధనాన్ని నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఎటువైపు ఉంచాలి. ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్ర

మనిషి జీవితంలో ముఖ్యమైనది ప్రేమానుబంధాల తరువాత డబ్బే. కొన్ని సంధర్భాల్లో ఈ డబ్బే అనుబంధాలను కూడా మించిపోతుంది. అలాంటి ధనాన్ని నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఎటువైపు ఉంచాలి. ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఏ వైపు ఉండాలో నిర్ధేశించినట్లే బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు.
 
మన ఇంటిలో కొన్ని ప్రదేశాల్లో బరువు ఉండకూడదని చెప్పినట్టే కొన్నిచోట్ల బరువు ఉండొచ్చని కూడా సూచిస్తున్నారు. ఆ ప్రకారంగానే ఇంట్లో నైరుతి భాగంలోనే బరువును పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజానికి ఈ దిక్కున ఎలాంటి బరువు పెట్టకూడదట. మన జీవితంలో అతి ముఖ్యమైన బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. చంద్రుడు ధనప్రవాహానికి అధిపతి కనుక వాస్తు సూచనలను అనుసరించి డబ్బు, నగలు భద్రపరుచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో అంటే పశ్చిమానికి, ఉత్తరానికి మధ్యలో ఉండే మూలన ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
 
అలాగే ఈ బీరువాను దక్షిణ దిక్కున పెడితే శ్రేష్టమట. కానీ బీరువా తెరిచినప్పుడు మన ముఖం ఉత్తరవైపున ఉండేలా చూసుకోవాలి. ఈ సూచనలు పాటించినట‌్లయితే మన జీవితంలో ధన నష్టం జరగకపోవడమే కాదు ఊహించని ధనం మన ఇంటికి వచ్చి చేరుతుంది. బీరువాను ఉత్తరదిక్కు మధ్య ఉంచితే చాలా మంచిదేనట. ఎందుకంటే ఉత్తర దిక్కుకు బుదుడు అధిపతి.