బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (11:06 IST)

చంద్రగ్రహణంతో వృషభ, కన్య, తుల, కుంభ రాశులకు శుభఫలితాలు..

హేవళంబి సంవత్సరం మాఘ మాసం 18వ రోజైన 31వ తేదీన (31-01-2018) బుధవారం, పౌర్ణమి. బుధవారం పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటక రాశి, కన్య లగ్నంలో చంద్రగ్రహణం ఆరంభం అవుతోంది. చంద్ర గ్రహణం ఆరంభ కాలం సాయంత్రం

హేవళంబి సంవత్సరం మాఘ మాసం 18వ రోజైన 31వ తేదీన (31-01-2018) బుధవారం, పౌర్ణమి. బుధవారం పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటక రాశి, కన్య లగ్నంలో చంద్రగ్రహణం ఆరంభం అవుతోంది. చంద్ర గ్రహణం ఆరంభ కాలం సాయంత్రం 5.16 గంటలకు. చంద్రగ్రహణం రాత్రి 8.40 గంటలకు ముగుస్తుంది. శాంతి చేయాల్సిన వారు.. బుధవారం పుట్టిన వారు శాంతి చేయాలి. 
 
అదేవిధంగా పునర్వసు, పుష్య, ఆశ్లేష, విశాఖ, జ్యేష్ట, పూర్వాభాద్ర, అనురాధ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన జాతకులు శాంతి పూజలు చేయించుకోవాలి. గర్భిణీ మహిళలు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు చంద్రుడిని చూడకూడదు. గ్రహణం విడిచాక ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని.. స్నానం చేయాలి. ఆపై వారి వారి సంప్రదాయాల ప్రకారం పూజలు చేసుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం ఏ రాశులపై ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ గ్రహణం కర్కాటక రాశిలో ఏర్పడటం ద్వారా చంద్రగ్రహణ ప్రభావం మకరరాశిపై కూడా వుండటంతో ఈ రెండు రాశుల వారు ఆలయాల్లో శాంతిపూజలు చేయించాలి. 
 
ధనస్సు, మేషం, కర్కాటక, సింహ రాశుల వారికి ఈ చంద్రగ్రహణం అధమ ఫలితాన్ని ఇస్తుంది. మిథునం, వృశ్చిక, మకర, మీన రాశుల వారికి మధ్యమ ఫలితం దక్కుతుంది. వృషభ, కన్య, తుల, కుంభ రాశుల వారికి శుభ ఫలితాలు ఖాయమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
గర్భిణీ మహిళలు చంద్రగ్రహణం సమయంగా కదలకుండా వుంటే మంచిది. లేదా పడుకుండిపోవడం చేయాలి. ఆ సమయంలో ఆహారం తీసుకోకూడదు. గ్రహణం విడిచాక కొత్తగా వండుకుని తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
 
చంద్రుడు స్త్రీలకు, సింగిల్స్ పారెంట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. అదే సూర్యుడైతే ఆధిపత్య పురుషులు, రాజకీయ నాయకులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. చంద్రుడు మనఃకారకుడు. మన ఆలోచనలకు, బాధలకు, సంతోషాలకు ప్రతిబింబం. కుటుంబాల మధ్య సఖ్యత పెరగాలంటే.. చంద్రగ్రహణ ప్రభావం అధికంగా వుండే రాశులు ఆలయాల్లో జరిగే పూజలు, శాంతిహోమాల్లో పాల్గొనడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సలహా ఇస్తున్నారు.