మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : ఆదివారం, 28 జనవరి 2018 (18:05 IST)

108 సంవత్సరాలకు ఓసారి.. సోమవారం ప్రదోషం.. ఏం చేయాలంటే?

హేవళంబి సంవత్సరం, మాఘ మాసం, సోమవారం (29-01-2018) రోజున ప్రదోషం వస్తోంది. ఈ ప్రదోషం 108 సంవత్సరాలకు ఒకసారి వస్తోంది. ఇది అద్భుతమైన ప్రదోష కాలం. ఈ ప్రదోష మహిమ ఏంటంటే.. శివునికి ప్రీతికరమైన, మహాదేవుని జన

హేవళంబి సంవత్సరం, మాఘ మాసం, సోమవారం (29-01-2018) రోజున ప్రదోషం వస్తోంది. ఈ ప్రదోషం 108 సంవత్సరాలకు ఒకసారి వస్తోంది. ఇది అద్భుతమైన ప్రదోష కాలం. ఈ ప్రదోష మహిమ ఏంటంటే.. శివునికి ప్రీతికరమైన, మహాదేవుని జన్మనక్షత్రంగా పేర్కొనే ''ఆరుద్ర'' ఇదే రోజున రావడం. ఈ రోజున సోమవారం, ఆరుద్ర నక్షత్రం, త్రయోదశి మూడు కలిసి రావడంతో శివునిని పూజించడం ద్వారా పుణ్య ఫలితాలను పొందవచ్చు. 
 
ఇంకా సోమవారం ప్రదోష కాలం అంటే సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల్లోపు శివాలయాల్లో జరిగే అభిషేకాల్లో పాలుపంచుకోవాలి. ఈ సందర్భంగా శివాలయంలో జరిగే నందీశ్వరునికి, ఈశ్వరునికి అభిషేకం కోసం పాలు, చందనం, కొబ్బరినీటిని సమర్పించాలి. అలాగే బిల్వపత్రాల మాలను సమర్పించుకుంటే తెలిసీ తెలియక చేసిన పాపాలు హరించుకుపోతాయి. 
 
అలాగే జాతక దోషాలున్నా తొలగిపోతాయి. రాహు-కేతు, చంద్ర దోషాలు నివృత్తి అవుతాయి. నవగ్రహ దోషాలన్నింటికీ పరిహారం చేసినవారమవుతాం. వ్యాపారంలో వృద్ధి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహ అడ్డంకులు దూరమవుతాయి. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. అందుచేత సోమవారం ఆలయాల్లో జరిగే ప్రదోష పూజలో పాల్గొనడం ద్వారా.. ఆ శివుని అనుగ్రహాన్ని పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.