మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (13:52 IST)

రాజశేఖర్ గరుడ వేగ వచ్చేస్తోంది.. సన్నీలియోన్ పాటే హైలైట్..

గరుడ వేగ సినిమా వచ్చేనెల మూడో తేదీన రిలీజ్ కానుంది. రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూ.25కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాపై

గరుడ వేగ సినిమా వచ్చేనెల మూడో తేదీన రిలీజ్ కానుంది. రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూ.25కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటివరకు చేయని వైవిధ్యమైన రోల్‌లో రాజశేఖర్ కనిపించనున్నాడు. 
 
ఇందులో పూజా కుమార్ కథానాయికగా నటించింది. శ్రద్ధా దాస్ కీలకమైన పాత్రను పోషించింది. ఇక పోర్న్ స్టార్ కమ్ సినీ స్టార్ సన్నీలియోన్ చేసిన ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సినీ పండితులు అంటున్నారు. రాజశేఖర్ చాలా గ్యాప్ తరువాత వస్తుండటంతో ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.