గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (10:01 IST)

కుటుంబ కథా చిత్రమ్ ట్రైలర్

నందు, శ్రీముఖి, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించిన కుటుంబ కథా చిత్రమ్ సినిమా టీజర్ విడుదలైంది. కె.ఎస్‌ వాసు దర్శకత్వంలో, భాస్కర గ్రూప్ అఫ్ మీడియా సంస్థ బ్యానర్ పై దాసరి భాస్కర్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్

నందు, శ్రీముఖి, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించిన కుటుంబ కథా చిత్రమ్ సినిమా టీజర్ విడుదలైంది. కె.ఎస్‌ వాసు దర్శకత్వంలో, భాస్కర గ్రూప్ అఫ్ మీడియా సంస్థ బ్యానర్ పై దాసరి భాస్కర్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్లో నందు, శ్రీముఖి, కమల్‌ కామరాజు మ‌ధ్య చిత్రీక‌రించిన స‌న్నివేశాల‌ను చూపించారు. దీనిని బట్టి చూస్తే ఇది సస్పెన్స్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది.
 
సునీల్‌ కశ్యప్ ఈ సినిమాకి స్వ‌రాలు అందిస్తున్నారు. టీజర్ కంటే కాస్త ముందుగా ‘కుటుంబ కథా చిత్రం’ ఫస్ట్‌లుక్‌‌ను విడుదల చేశారు. ఇందులో నందు, శ్రీముఖి దిగాలుగా కూర్చొని ఉండగా.. వెనకాల కమల్‌ కామరాజు కాస్త భయగొల్పేలా ఉన్నాడు. ప్రస్తుతం విడుదలైన టీజర్‌కు నెటిజన్ల మధ్య మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.