శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (12:26 IST)

విడుదలకు ముందే చిత్రం రిలీజ్... ఇంద్రసేనగా విజయ్ ఆంటోనీ

సంగీత దర్శకుడి నుంచి నటుడిగా మారిన విజయ్ ఆంటోని "బిచ్చగాడు" సినిమాతో ఓవర్ నైట్‌స్టార్ అయ్యాడు. కేవలం తమిళంలోనేకాక తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సంగీత దర్శకుడి నుంచి నటుడిగా మారిన విజయ్ ఆంటోని "బిచ్చగాడు" సినిమాతో ఓవర్ నైట్‌స్టార్ అయ్యాడు. కేవలం తమిళంలోనేకాక తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులలో చాలా క్యూరియాసిటి నెలకొంది. 
 
తాజాగా, సి.శ్రీనివాస్ దర్శకత్వంలో 'అన్నాదురై' చిత్రాన్ని విజయ్ ఆంటోని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తెలుగులో 'ఇంద్రసేన' టైటిల్‌తో విడుదల కానుంది. ఇందులో విజయ్ మాస్ అవతారంలో కనిపించనున్నాడు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి పాటల వేడుక జరపనుండగా, ఈ ఆడియో కార్యక్రమంలో ఇంద్రసేన ట్రైలర్‌తో పాటు 10 నిమిషాల సినిమాని కూడా ప్రదర్శించనున్నట్టు టాక్. 
 
ఈ వేడుక నవంబర్ 15న జరగనుంది. గతంలో "బేతాళుడు" సినిమా కోసం విజయ్ ఆంటోని ఇదే ఫార్ములాని ఫాలో అయిన సంగతి తెలిసిందే. ఆంటోని ఫిలిం కార్పొరేషన్, రాధికా శరత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో డయానా చంపిక కథానాయికగా నటిస్తుంది. నవంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.