శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (13:46 IST)

పెళ్లైన మహిళలు బుధవారం పూట తలస్నానం చేస్తే? మంగళ-శుక్రవారాల్లో తలస్నానం చేయకూడదా?

సోమవారం మహిళలు తలస్నానం చేయడం ద్వారా సౌభాగ్యం చేకూరుతుంది. మంగళవారం తలంటు స్నానం మంచిది కాదు. శనివారం పూట తలంటు స్నానం చేయడం ద్వారా.. ఐశ్వర్యం చేకూరుతుంది. ఇక బుధవారం, గురువారం పూట తలస్నానాలకు ఎలాంటి

మహిళలు బుధవారం తలస్నానం చేయొచ్చా..? అనే డౌట్ మీలో ఉందా..? అయితే ఈ స్టోరీ చదవండి. మీకు పెళ్లైతే.. తప్పనిసరిగా ప్రతి బుధవారం తలస్నానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఎందుకంటే? శుక్రవారం-మంగళవారం పూట తలంటు స్నానం చేయడం కూడదు. అలాచేస్తే సౌఖ్యాలు దూరమవుతాయి. అలా శుక్ర-మంగళవారం పూట ఆడవారు తలస్నానం చేయాలనుకుంటే.. తలంటు స్నానంలా కాకుండా నీటితో షాంపుతో సరిపెట్టుకోవడం మంచిది. శుక్రవారం-మంగళవారం తలస్నానం చేస్తే దోషం కలుగుతుంది.
 
అలాగే సోమవారం మహిళలు తలస్నానం చేయడం ద్వారా సౌభాగ్యం చేకూరుతుంది. మంగళవారం తలంటు స్నానం మంచిది కాదు. శనివారం పూట తలంటు స్నానం చేయడం ద్వారా.. ఐశ్వర్యం చేకూరుతుంది. ఇక బుధవారం, గురువారం పూట తలస్నానాలకు ఎలాంటి బ్రేక్‌లు అవసరం లేదు. ముఖ్యంగా బుధవారం పూట తలస్నానం చేయడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
బుధవారం నాటి తలస్నానం ద్వారా భార్యాభర్తల మధ్య ఐక్యమత్యం పెరుగుతుందని వారు చెప్తున్నారు. అందుకే వివాహానంతరం మహిళలు బుధవారం పూట తలస్నానం చేయడం ఉత్తమం. అలాగే విద్యార్థులు బుధవారం తలస్నానం చేయడం ద్వారా బుధగ్రహ ప్రభావంతో విద్యాబుద్ధి పెరుగుతుందని.. విద్యారంగంలో రాణిస్తారని పంచాంగ నిపుణులు సెలవిస్తున్నారు.