1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 8 జూన్ 2024 (19:14 IST)

09-06-2024 నుంచి 15-06-2024 వరకు మీ వార రాశిఫలాలు

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుంది. ఖర్చులు సామాన్యం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఇదీ ఒకందుకు మంచిదే. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు హోదామార్పు. ఉపాధి పథకంలో నిలదొక్కుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు మరింత చేరువవుతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. సోమ, మంగళ వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. కీలక పత్రాలు అందుకుంటారు.
 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పధంతో మెలగండి. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. యత్నాలు విరమించుకోవద్దు. ఆప్తుల సలహా పాటించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలెవురవుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. శుక్రవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్సేల్ వ్యాపారులకు కష్టసమయం. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ప్రతి చిన్న విషయానికీ చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆదివారం నాడు పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు మొండిగా పూర్తిచేస్తారు. గురు, ఆది వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. సంతానం ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. సంస్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. శనివారం నాడు పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. వృత్తుల వారికి బాగుంటుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వాహనదారులకు దూకుడు తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కీలకమైన వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. శ్రమాధిక్యత, అకాలభోజనం. బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆది, సోమ వారాల్లో ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. మీ సలహా కొందరికి మేలు చేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరాస్తి అమర్చుకునేందుకు యత్నాలు సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను నమ్మవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు శుభయోగం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మంగళవారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. రిప్రజెంటేటివ్ లకు సదవకాశాలు లభిస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధిచేకూరుతుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. బుధ, గురు వారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయినిలకు కష్టసమయం. ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఏకాగ్రతతో వ్యవహరించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉండి. ఒంటెద్దు పోకడ తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పాతమిత్రులు తారసపడతారు. గత అనుభవాలు ఉల్లాసాన్నిస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహనిర్మాణాలు ముగింపు దశకు వస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వేడుకకు హాజరుకాలేరు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం అన్నివిధాలా కలిసివచ్చే సమయం. ఆప్తులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉన్నతాధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. శనివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా తీసుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.