1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Big Setback For India: Hardik Pandya May Not Be Back In Action Before IPL 2027

టీమిండియాకు షాక్ - 2027 ఐపీఎల్ సిరీస్ వరకు హార్దిక్ దూరం?

Hardik Pandya
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా వచ్చే 2027 ఐపీఎల్ సీజన్ వరకు దూరంగా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. కాలి కండరాల లోపలి భాగంలో ఏర్పడిన  స్ట్రెస్ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు హార్దిక్‌కు మరికొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పాండ్యా బెంగులళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లోని పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పాండ్యా పూర్తిస్థాయిలో కోలుకునేందుకు మరికొంత సమయం పట్టొచ్చని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్న ఐపీఎల్ 2027 వరకు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉండొచ్చని తెలిపింది. అయితే, అతడి పునరాగమనంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 
ప్రస్తుతం హార్దిక్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాస చికిత్స తీసుకుంటున్నాడు. మీడియా కథనాల మేరకు, అతడి వైద్య నివేదికలను గత వారం డాక్టర్ దిన్ పార్దివాలా పరిశీలించారు. వైద్యుల సూచనల మేరకు దశలవారీగా ఫిట్నెస్ సాధించే కార్యక్రమాన్ని హార్దిక్ కొనసాగిస్తున్నాడు.
 
పునరావాస ప్రణాళిక ప్రకారం మరో మూడు వారాల తర్వాత అతడు నెమ్మదిగా జాగింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాతి ఎనిమిది వారాల్లో పరుగెత్తే సమయాన్ని, తీవ్రతను క్రమంగా పెంచనున్నారు. గాయంపై మళ్లీ ఒత్తిడి పడకుండా స్ట్రెంత్ ట్రైనింగ్‌ను కూడా జాగ్రత్తగా పెంచుతున్నారు. పూర్తి స్థాయి మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
 
ఈ పరిస్థితి కొనసాగితే డిసెంబరు 13 నుంచి ప్రారంభంకానున్న శ్రీలంకతో వన్డేలు, టీ20ల సిరీస్‌కు హార్దిక్ దూరమయ్యే అవకాశం ఉంది. జనవరి 3 నుంచి జరగనున్న జింబాబ్వేతో వన్డే సిరీస్‌లోనూ ఆడకపోవచ్చని నివేదిక పేర్కొంది. ఇప్పటికే అతడు న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. 2026లోనూ హార్దిక్ పలు సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు చివరిసారిగా ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరపున మే నెలలో మ్యాచ్ ఆడిన విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
జస్‌ప్రీత్ బుమ్రాను టెస్టుల్లో మాత్రమే ఆడనివ్వాలి.. రవిశాస్త్రి