వేద వ్యాసుని కాలజ్ఞానం.. జరుగుతున్నవన్నీ ఎప్పుడో చెప్పేశారట.. కాశీ నీట మునిగి..?
పోతులూరి వీరబ్రహ్మం తరహాలో మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి కూడా కలియుగంలో జరిగే పలు సంఘటనల గురించి ఎప్పుడో చెప్పేశారట. కాలజ్ఞానాన్ని తెలిసిన వ్యాసుడు చెప్పినవన్నీ నిజమౌతున్నాయని ఆధ్యాత్మిక పండితులు
పోతులూరి వీరబ్రహ్మం తరహాలో మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి కూడా కలియుగంలో జరిగే పలు సంఘటనల గురించి ఎప్పుడో చెప్పేశారట. కాలజ్ఞానాన్ని తెలిసిన వ్యాసుడు చెప్పినవన్నీ నిజమౌతున్నాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇందులో ఒకటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఓ పుణ్యస్థలం (కాశీ) మొత్తం నీటితో నిండిపోతుందట. ఇందులో గంగానదిలో ఏర్పడిన వరదలు నిదర్శనంగా నిలిచింది.
దైవభక్తు తగ్గిపోతుందని.. పూజలు కూడా ఏదో మొక్కుబడిగా మానవులు చేస్తారట. దేవుడి గురించే కాదు, ప్రపంచంలోని ఏ విషయం గురించి తెలియకున్నా అలాంటి వారే గొప్ప సన్యాసులుగా, యోగులుగా, స్వామీజీలుగా కీర్తించబడతారట.
విపరీతమైన చలి, గాలులు, ఎండ, వర్షాలు, మంచు వంటి ప్రకృతి భీభత్సాలే కాక మనుషులు గొడవలు, ఆకలి, దాహం, వ్యాధులు వంటి కారణాల వల్ల ఎక్కువగా నశిస్తారట. ఇక స్త్రీ, పురుషులు ఇద్దరూ వివాహం చేసుకోకుండానే సహజీవనం చేయడం ప్రారంభిస్తారట. మానవుల మధ్య ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగిపోతాయట. చిన్న గొడవలకే హత్యలకు పాల్పడతారట. పెద్దలకు గౌరవం లభించదు. కలి ప్రభావంతో నీతి, న్యాయం నశిస్తుందట. ఈ విషయాలను మహాభారతంలోనే వేద వ్యాసుడు పేర్కొని ఉన్నట్లు ఆధారాలు కలవు.