దుర్గామాత అనుగ్రహం కోసం అఖండ దీపం వెలిగిస్తే..?
దుర్గామాత అనుగ్రహం కోసం దుర్గాష్టమి రోజు నాడు దుర్గాష్టమి వ్రతంను ఆచరిస్తారు. ప్రతి నెల శుక్ల పక్షం 8వ రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు. దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరించేటువంటి భక్తులు ఈ రోజంతా తినడం కానీ తాగడం కానీ చేయకుండా ఉపవాసాన్ని ఉంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ దుర్గాష్టమి రోజునాడు కుమారి పూజను కూడా ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది.
6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినటువంటి బాలికలను దుర్గా అమ్మవారి స్వరూపంగా కుమారి పూజను చేస్తారు. ఈరోజు దుర్గా శక్తి మాల మంత్రాన్ని దేవి ఖడ్గమాలను అలాగే దుర్గా చాలీసా చదవడం చాలా మంచిది. అంతేకాకుండా ఆరోజు వేకువ జామునే నిద్రలేస్తారు.
అనంతరం ధ్యానం చేసి దుర్గాదేవిని ప్రార్థిస్తారు. ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే చమురు దీపాన్ని వెలిగిస్తారు. దీన్ని అఖండ జ్యోతి అని పిలుస్తారు. దేవత ఆశీర్వాదం కోసం అమ్మవారి కథ లేదా దుర్గా సప్తశతిని పఠిస్తూ ఆ రోజు గడుపుతారు.