Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కార్తీక మాసంలో అరుదుగా వ‌చ్చిన ఐదు సోమవారాలు....

ఈ ఏడాది కార్తీక మాసం అరుదైన‌ది. శివుడికి ప్రీతిపాత్ర‌మైన‌ది సోమవారం... అలాంటిది ఈ కార్తీక మాసం సోమ‌వారంతోనే ప్రారంభం అయింది. అందుకే ఈ మాసంలో అరుదుగా 5 సోమ‌వారాలు వ‌స్తున్నాయి. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావటం ఓ ప్రత్యేకత.

Written By JSK
Updated: మంగళవారం, 1 నవంబరు 2016 (19:20 IST)
ఈ ఏడాది కార్తీక మాసం అరుదైన‌ది. శివుడికి ప్రీతిపాత్ర‌మైన‌ది సోమవారం... అలాంటిది ఈ కార్తీక మాసం సోమ‌వారంతోనే ప్రారంభం అయింది. అందుకే ఈ మాసంలో అరుదుగా 5 సోమ‌వారాలు వ‌స్తున్నాయి. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలిసి రావటం ఓ ప్రత్యేకత. 
 
ఈ కార్తీక‌మాసంలో న‌వంబ‌రు ఒక‌టిన సోదరి ఇంట భోజనం చేయాలి. కార్తీక మాసంలో మొదటిగా వచ్చేది యమ విదియ.. దీనినే భగినీ హస్త భోజనం.. అన్నాచెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు. యమధర్మరాజు సోదరి యమనా దేవి ఒకరోజు అలక చెందగా, ఆయన ఆమెకు ఒక వరం ఇస్తారు. యమ విదియ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక భాదలు ఉండవని చెబుతారు. అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేసి ఆశీర్వచనాలు అందిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. 
 
న‌వంబ‌రు 3న‌  నాగుల చవితి... మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగ నాగుల చవితి. ఈ రోజున పుట్టలో పాలు పోసుకుని నాగేంద్రుడికి పూజలు చేస్తారు. సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రార్థిస్తారు. పూర్వం తక్షకుడు చేపట్టిన సర్పయాగం వల్ల యాగంలో పడి పాములు చనిపోతాయి. సర్పరాజు తపస్సు చేసి ఇంద్రుడుని ప్రార్థిస్తాడు.ఆయన ఆ యాగాన్ని ఆపించడం వల్ల సర్పజాతికి విముక్తి కలుగుంది. అందుకే ఆ రోజున భక్తులు ఆనందంగా పుట్టలో పాలు పోసి వారికి సమర్పిస్తారు.
 
న‌వంబ‌రు 10 న ఏకాదశి: ఏకాద‌శి నాడు ఉపవాసాలు ఉంటారు. మహావిష్ణువు క్షీర సముద్రంలో శయన ఏకాదశి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక ఏకాదశి రోజున తిరిగిలేస్తారు. అందుకే ఉపవాసాలు ఉండి మరుసటి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి భోజనం చేస్తారు.
 
న‌వంబ‌రు 11న క్షీరాబ్ది ద్వాదశి. ఆరోజు సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రి(ఉసిరి మొక్క)ను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. న‌వంబ‌రు 12న  దీపాలను వెలిగించి మహిళలు పూజలు చేసుకుంటారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇల్లూ దీపాల వెలుగులతో నిండిపోతుంది.
 
న‌వంబ‌రు 14న కార్తీక పౌర్ణమి. కృత్తిక నక్షత్రంతో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. 14వ తేదీన ఉదయం నుంచి ఉపవాసం ఉండి, కార్తీక దామోదరుడిని పూజించి 365 ఒత్తులు వెలిగించి చంద్రుని దర్శనమైన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. అంతేకాకుండా కొత్తగా పెళ్లయిన అమ్మాయితో 33 పున్నమి నోములు చేయిస్తారు. ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడిపండు, కంద, పసుపు మొక్కతో పాటు స్వయంపాకం ఇప్పిస్తారు. 30 తేదిన పోలి స్వర్గం కార్తీక మాసం ఆఖరి రోజు 30న అమావాస్య వెళ్లిన మరుసటి రోజున పోలిస్వర్గం పూజలు చేస్తారు.

అన్నీ చూడండి

కిడ్నాప్ ఆరోపణల కేసు.. వైకాపా నేత షేక్ మహ్మద్ ముస్తఫా అరెస్ట్

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

వెనిజువెలాలో భారీ భూకంపం... మృతుల సంఖ్య 6,125 పైమాటే...

సజ్జల నన్నే రావద్దంటారా? వైసిపి పార్టీ ఆఫీసు ముందు బోరుమంటూ బోరుగడ్డ అనిల్, వీడియో

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

అన్నీ చూడండి

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి అమెరికా ప్రవచనం ముఖ్యాంశం

04-08-2026 మంగళవారం ఫలితాలు.. మీ కష్టం వృధాకాదు.. శుభవార్త వింటారు..

03-08-2026 సోమవారం ఫలితాలు - అప్రమత్తంగా ఉండాలి.. భేషజాలకు పోవద్దు...

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

తర్వాతి కథనం
Show comments