1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Lakshmi Devi likes those 3 days, if pray on these days can increase wealth

లక్ష్మీదేవికి ఆ 3 రోజులు అంటే ఇష్టం, అలా చేస్తే సంపద పెరుగుతుంది

Lakshmi Devi
ఎక్కువగా స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. దేవికి ప్రత్యేకంగా కొన్ని వారాలు అంటే చాలా ఇష్టం. మంగళ, గురు, శుక్రవారాలు అంటే ఇష్టం. ఈ మూడు వారాలలో శుక్రవారం అంటే ఏంతో ప్రీతి. ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి వాకిళ్ళు శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి.
 
 గుమ్మాలు తుడిచి పసుపు రాసి కుంకుమ, గంధం బొట్టులను పెట్టాలి. అంతేకాదు దేవికి తెల్లపూలు అంటే చాలా ఇష్టం. ఈ పూలతో అష్టోత్తరం చేయడం వలన మంచి ఫలితం వుంటుంది. మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తాము. వాటి వలన కూడా లక్ష్మీదేవి దూరం అవుతుంది. 
 
తులసిని పూజించని చోట, పెద్దవారిని దూషించిన చోట, ఇతరుల తప్పులను ఏకరువు పెట్టిన చోట, వాకిట్లో ముగ్గు లేని చోట, లక్ష్మీదేవి నివశించదు. ఇల్లు కళకళలాడుతూ, పేదవారికి సహాయం చేస్తూ, మంగళ, శుక్రవారాలలో దేవిని పూజిస్తూ, పశుపక్షులను ప్రేమించే చోట, అందరూ సంతృప్తిగా వుండే చోట లక్ష్మీదేవి ఇష్టంగా ఉంటుంది.
 
 సాయంసంధ్యావేళలో ముఖద్వారాలను మూసి వేయకూడదు. గుమ్మంపై కూర్చోరాదు. ఇంటిలో ఆడవారు కన్నీరు పెట్టకూడదు. అలాంటి ఇళ్ళలో లక్ష్మీదేవి కొలువు ఉండదు. సంపద మన ఆధీనంలోఉండాలి కాని మనం సంపద ఆధీనంలో మనం ఉండకూడదు. ఇతరులకు సహాయం చేయడం వలన సంపద పెరుగుతుంది. మనం తృప్తిగా సంతోషంగా ఉంటాము.
About Writer
సిహెచ్