శ్రీకృష్ణుని సేవలో 5 రకాలైన భక్తులు, వారిని కాపాడే పరమాత్మ
శుద్ధ భక్తుడు శ్రీకృష్ణునే సదా తలచుచు అతని యందు ధ్యానమగ్నుడై యుండును. శుద్ధ భక్తుని లక్షణములివే. అట్టివారికి శ్రీకృష్ణుడు సులభముగా లభ్యమగును. కనుకనే అన్ని యోగముల కన్నా భక్తి యోగమే ఉత్తమమని భగవద్గీత ఉపదేశించుచున్నది. అట్టి భక్తియోగమునందు చరించు భక్తులు ఐదు విధములుగా శ్రీకృష్ణభగవానునికి సేవను గూర్చుచుందురు.
1. శాంతభక్తుడు: శాంతరసము ద్వారా భక్తియుత సేవను గూర్చెడివాడు.
2. దాస్యభక్తుడు: దాసునిగా భక్తి యోగము నందు నియుక్తుడైనవాడు.
3. సభ్యభక్తుడు: స్నేహితుని రూపమున సేవను గూర్చెడివాడు.
4. వాత్సల్య భక్తుడు: పితృభావముతో సేవను గూర్చెడివాడు.
5. మధుర భక్తుడు: మాధుర్య స్వభావముతో ప్రియురాలిగా భక్తిని గూర్చెడివాడు.
ఈ మార్గములన్నిటిలోను శుద్ధ భక్తుడు శ్రీకృష్ణభగవానుని సేవలో సతతము నిలిచియుండి అతనిని మరువకుండును. ఈ కారణంగా అతడికి శ్రీకృష్ణుడు సులభముగా లభింపగలడు. ఇదియే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే, హరే రామ హరే రామ రామరామ హరేహరే అనే మహామంత్ర కీర్తనపు దివ్య వరమై వున్నది.