శిరీడీ సాయిబాబా వాక్కులు...

1. సమస్త విషయములయందు మనము నిర్మలుడవుగా వుండవలెను. నిజమైన మానవునికి మమత కాక సమత వుండవలెను. చిన్నచిన్న విషయముల గూర్చి ఇతరులతో పోట్లాడుట అవివేకం. ధనమిచ్చిన పుస్తకములనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు.

సోమవారం, 2 జనవరి 2017 (22:41 IST)
1. సమస్త విషయములయందు మనము నిర్మలుడవుగా వుండవలెను. నిజమైన మానవునికి మమత కాక సమత వుండవలెను. చిన్నచిన్న విషయముల గూర్చి ఇతరులతో పోట్లాడుట అవివేకం. ధనమిచ్చిన పుస్తకములనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు.
 
2. నా మనుష్యుడు ఎంత దూరమున వున్నప్పటికీ, 100 క్రోసుల దూరమున వున్నప్పటికీ, పిచ్చుక కాళ్ళకు దారము కట్టి ఈడ్చినట్లు అతని శిరిడీకి లాగెదను.
 
3. నన్ను గూర్చి ఇతరులను అడుగవలదు. మన కండ్లతోనే సమస్తము చూడవలెను. నా గురించి నన్నె అడుగవలెను. అప్పు చేసి శిరిడీకి రావలదు.
 
4. నా భక్తుల గృహముల యందు ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు. నాకు రూపము లేదు. నేను అన్నిచోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి, నా ధ్యానమందే మునిగియుందురో వారి పనులన్నియూ సూత్రధారినై నేనే నడిపించెదను.
 
5. ఎవరయితే తమ అంత్య దశలో నన్ను జ్ఞాపకము ఉంచుకొనెదరో వారు నన్నే చేరెదరు. ఎవరయితే వేరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు.
 
6. ధనము, ఐశ్వర్యం మున్నగు నవి శాశ్వతము కావు. శరీరము సైతం శిధిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని, నీ కర్తవ్యమును చేయుము. ఇహ పరలోక వస్తువులన్నింటియందు వ్యామోహము విడిచి పెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదాలను శరణు వేడెదరో, వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తి పోయి సహాయము చేయును.
 
7. శిరిడీలో నువ్వు నన్ను నిత్యం చూసే ఈ మూడున్నర దేహము గల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడు శిరిడీలోనే యుండెదననుకొంటివి. నేను సర్వాతర్యామిని. నేను సర్వ జీవుల హృదయము నందు నివశించుచున్నాను.

అన్నీ చూడండి

TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ టికెట్ చెల్లింపులు-11 నెలల్లో రూ. 2.5 కోట్ల ఆదాయం

భర్తను హత్య చేసి ఇంటి బాత్రూమ్ ఫ్లోర్ కింద పూడ్చిపెట్టింది.. కారణం ఏంటి?

చీరాలలో ఆరునెలల పసిబిడ్డ కిడ్నాప్.. లక్షకు విక్రయం.. 24 గంటల్లో కనిపెట్టేశారుగా..

అలీ ఖమేనీ అంత్యక్రియలు.. గుండెల్లో బాదుకున్న జనం.. ప్రతీకారం అంటూ నినాదాలు

భార్య ప్రవర్తనలో మార్పు.. అనుమానం.. చంపేసిన భర్త.. ఎక్కడ?

అన్నీ చూడండి

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Sankatahara Chaturthi 2026: జూలై 3న కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి.. 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా..

02-07-2026 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి

తర్వాతి కథనం
Show comments