శుక్రవారం శుక్రగ్రహాన్ని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుందా? శుక్రునికి నవగ్రహాల్లో చోటెలా?
నవగ్రహాల్లో ఓ గ్రహాన్ని మనం శుక్రవారం పూట పూజలు చేయాల్సిందేనట. ఆ గ్రహాన్ని శాంత పరిస్తేనే సంపదలు కలుగుతాయట. అదే శుక్రగ్రహం. అయితే శుక్ర మహాదశ లేని వారు, శుక్రదోషం ఉన్న వారు కూడా శుక్రునికి పూజలు చేస్త
నవగ్రహాల్లో ఓ గ్రహాన్ని మనం శుక్రవారం పూట పూజలు చేయాల్సిందేనట. ఆ గ్రహాన్ని శాంత పరిస్తేనే సంపదలు కలుగుతాయట. అదే శుక్రగ్రహం. అయితే శుక్ర మహాదశ లేని వారు, శుక్రదోషం ఉన్న వారు కూడా శుక్రునికి పూజలు చేస్తే దాదాపు అలాంటి దశా ఫలితమే పొందవచ్చట. అయితే అలాంటివారు నేరుగా శుక్రుడిని కాకుండా శుక్రవారంపూట లక్ష్మీదేవిని పూజించాలట.
అంతేకాకుండా శుక్రవారం రోజున శివాలయానికి కూడా వెళ్లి పూజలు చేసిన వారిని శుక్రుడు అనుగ్రహించి వారికి సంపదలను కలిగిస్తాడట. శుక్రదోషం పోవాలంటే ప్రతి శుక్రవారం 108 సార్లు ''ఓం ద్రాం ద్రీం ద్రౌం సాహ్ శుక్రయే నమః'' అనే శుక్ర బీజమంత్రం పఠించాలట. దీంతో శుక్రదోషం పోయి అన్నీ శుభాలే కలుగుతాయట. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సంబంధ సమస్యలు, అనారోగ్యం వంటి సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇక శుక్రుడు భృగువు, ఉష అనే ఇద్దరు దంపతుల కుమారుడు. కాగా శుక్రుడు ఒకానొక సందర్భంలో శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. ఈ క్రమంలో శివుడు శుక్రుడి తపస్సుకు, భక్తికి మెచ్చి అతనికి వరాలను అనుగ్రహిస్తాడు.
శుక్రున్ని శివుడు సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు, కళలకు అధిపతిగానూ, రాక్షసులకు గురువుగానూ చేస్తాడు. దీంతోపాటు శుక్రునికి గ్రహ మండలంలో చోటు కల్పిస్తాడు. అప్పటి నుంచి శుక్రుడు నవగ్రహాల్లో ఒకడిగా పేరుగాంచాడు. జాతకంలో శుక్ర మహాదశ వస్తే ఎంతో అదృష్టమని, శుక్ర మహాదశ కాలం 20 సంవత్సరాల వరకు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ సమయంలో పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.