1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Significance of Dasavatarams

దశావతారాలకు కారణం ఏమిటి? విష్ణుమూర్తికి ఆ అవతారాలెందుకు?

శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన వ్రతం ఏకాదశి వ్రతం. ఆ వ్రతాన్ని అంబరీషుడనే రాజేంద్రుడు ఆచరిస్తున్నాడు. ఒక ద్వాదశి పారణమునకు దుర్వాస మునీంద్రులవారు అంబరీషునికి అతిథిగా విచ్చేశారు. ఆరోజు ద్వాదశి ఒక ఘడియ మాత్రమే వుంది. ఇంతలో మునీంద్రుడు స్నానం చేసేందుకు నద

Significance of Dasavatarams
శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన వ్రతం ఏకాదశి వ్రతం. ఆ వ్రతాన్ని అంబరీషుడనే రాజేంద్రుడు ఆచరిస్తున్నాడు. ఒక ద్వాదశి పారణమునకు దుర్వాస మునీంద్రులవారు అంబరీషునికి అతిథిగా విచ్చేశారు. ఆరోజు ద్వాదశి ఒక ఘడియ మాత్రమే వుంది. ఇంతలో మునీంద్రుడు స్నానం చేసేందుకు నదికి వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. అంబరీషునికి విపరీతమైన ఆకలి వేస్తోంది. ఐతే ఇంటికి వచ్చిన అతిథులు భుజించకుండా తినడం మహా దోషము. మరోవైపు వ్రత ఘడియలు మించిపోయే సమయం. 
 
ఏం చేయాలో పాలుపోని అంబరీషుడు మునీంద్రుడు రాకమునుపే భోజనం చేయడం ఆరంభించాడు. ఈలోపు దుర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుడు చేసిన పరాభవానికి మండిపడి అతడికి శాపమొనరించాడు. చేప, తాబేలు, పంది... తదితర పది జన్మలెత్తమని శపించాడు. అంతట అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించగా ప్రత్యక్షమైన శ్రీహరి, అంబరీషునికి బదులుగా తనే పది జన్మలు ఎత్తుతానని మునీశ్వరుని శాంతింపజేశాడు. అలా తన భక్తుని కోసం విష్ణుమూర్తి దశావతారాలు ధరించాడు.
About Writer
chj
తర్వాతి కథనం
తులసి మొక్క ఎండిపోతే ఇలా చేయాలి...