శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 7 జూన్ 2017 (20:23 IST)

గోవిందుని రథోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్త జనం

ఇసుకేస్తే రాలనంత జనం.. ఎటు చూసినా గోవింద నామస్మరణలే.. ఇదంతా ఎక్కడో కాదు.. తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం రథోత్సవం ఘనంగా జరిగింది. అశేష భక్తజనం స్వామి వారి రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు. ఉదయాన్నే స్వామివారిని సుగంధ పరిమళ ద్రవ

ఇసుకేస్తే రాలనంత జనం.. ఎటు చూసినా గోవింద నామస్మరణలే.. ఇదంతా ఎక్కడో కాదు.. తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం రథోత్సవం ఘనంగా జరిగింది. అశేష భక్తజనం స్వామి వారి రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు. ఉదయాన్నే స్వామివారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి, వజ్రవైఢూర్యాలతో అలంకరించి రథంపై అధిష్టింపజేశారు. భజనలు, కోలాటాలు, చెక్కభజనలు, ఏనుగుల ఘీంకార ధ్వనుల మధ్య రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
గత ఆరురోజుల నుంచి వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రోజుకో వాహనంలో ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్సనమిస్తున్నారు. మరో మూడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్సించుకుంటున్నారు. టిటిడి కూడా భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది.