1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: శుక్రవారం, 30 డిశెంబరు 2016 (22:48 IST)

తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు బదిలీ.. వైకుంఠ ఏకాదశి తరువాత..?

తిరుమల తిరుపతి దేవస్థానం పదవిలో కీలకమైనవి ఛైర్మన్‌, ఈఓ, జెఈఓ. తిరుపతిలో జెఈఓ పదవి కన్నా తిరుమల జెఈఓ పదవి అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే తిరుమల జెఈఓనే సేవా టిక్కెట్లను మంజూరు చేయాల్సింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విఐపిలకు వారి సిఫార్సు లేఖల ద్

తిరుమల తిరుపతి దేవస్థానం పదవిలో కీలకమైనవి ఛైర్మన్‌, ఈఓ, జెఈఓ. తిరుపతిలో జెఈఓ పదవి కన్నా తిరుమల జెఈఓ పదవి అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే తిరుమల జెఈఓనే సేవా టిక్కెట్లను మంజూరు చేయాల్సింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విఐపిలకు వారి సిఫార్సు లేఖల ద్వారా సేవా టిక్కెట్లను మంజూరు చేయాల్సింది ఒక్క తిరుమల జెఈఓనే. అందుకే ఈ  పదవికి అంత క్రేజ్‌ ఉంది. ఐఎఎస్‌లందరు ఈ పదవి కోసమే క్యూకడుతుంటారు. ఎలాగైనా ఈ పదవిని చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులతో బేరసారాలు పెట్టిన వారు లేకపోలేదు. 
 
అలాంటి పదవిని పట్టుకుని సుమారు 6సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు తితిదే తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు. మొదట్లో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మనిషిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాధ్యతలు చేపట్టిన నల్లారి ఆ తరువాత  ఆ పదవినే పట్టుకుని కూర్చున్నారు. తిరుమల జెఈఓ పదవిలో ఇన్ని సంవత్సరాలు పాటు ఉండడం తితిదే చరిత్రలోనే శ్రీనివాసరాజుది ఒక కొత్త శకం. ఈ విషయాన్ని తితిదే ఉన్నతాధికారులే స్వయంగా చెప్పుకుంటుంటారు.
 
ఎవరైనా సరే ఒకటి, రెండు సంవత్సరాలకు మించి ఉండరు. అలాంటిది తితిదే తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు మాత్రమే ఇన్ని యేళ్ళుగా ఉన్నారంటే ఆయన రాజకీయ పార్టీ నేతల్ని ఏ మాత్రం పట్టుకున్నారో అర్థమవుతుంది. అయితే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లలో కూడా ఆ పార్టీ పదవిని నారాలోకేష్‌ సహకారంతో కొనసాగిస్తున్నారు జెఈఓ. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సరిగ్గా సేవా టిక్కెట్లు జెఈఓ ఇవ్వడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. ముందు నుంచీ నారాలోకేష్ కు సన్నిహితంగా ఉండడంతో ఆయన పదవి అలాగే ఉంటూ వచ్చింది. 
 
అయితే తిరుమల జెఈఓపై ఏకంగా చంద్రబాబునాయుడుకే ఫిర్యాదు చేశారు కొంతమంది నేతలు. దీంతో జెఈఓ  పంచాయతీ కాస్త బాబు చెవికి పడడంతో సేవా టిక్కెట్ల వ్యవహారంపై ఇప్పటికే శ్రీనివాసరాజు వ్యవహారంపై గుర్రుగా ఉన్న బాబు ఆయన్ను అక్కడి నుంచి పంపేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట. ఇంకేముంది అనుకున్నదే తడువుగా వైకుంఠ ఏకాదశి తరువాత ఆ బదిలీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్థమయ్యారు. తిరుమలలో నూతన సంవత్సరం అన్నా, వైకుంఠ ఏకాదశి అన్నా ఎంతో ప్రాశస్త్యం..అందుకే ఇలాంటి పరిస్థితిలో జెఈఓను మార్చకూడదన్న నిర్ణయంలో బాబు ఉన్నట్లు తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి 8,9తేదీలలో ముగుస్తుంది. ఆ పర్వదినం ముగియగానే వెంటనే శ్రీనివాసరాజును బదిలీ చేయనున్నారని సమాచారం.