Dharma Sangrah
✕

జపం అంటే ఏమిటి? ఎన్ని రకాలుగా చేస్తారు... ఏంటి ప్రయోజనం?

భగవంతుడిని ఆరాధించే పలు విధానాల్లో చాలా ముఖ్యమైనది, అందరూ సులభంగా చేయగలిగినది జపం. ఏదో మొక్కుబడిగా కాకుండా, కాలక్షేపానికి కాకుండా ఓ నియమం ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబ

Written By venu
Updated: శుక్రవారం, 19 మే 2017 (17:08 IST)
భగవంతుడిని ఆరాధించే పలు విధానాల్లో చాలా ముఖ్యమైనది, అందరూ సులభంగా చేయగలిగినది జపం. ఏదో మొక్కుబడిగా కాకుండా, కాలక్షేపానికి కాకుండా ఓ నియమం ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ రోజుకు ఎన్నిసార్లు జపం చేయాలి, ఏ విధంగా చేయాలి అనే నియమాలు చాలా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం-
 
వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధః స్మృతః
త్రయాణాం జపయఙ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరమ్
వాచికము, ఉపాంశువు, మానసికము అనే మూడు విధానాల్లో జపం చేయవచ్చు. బయటకు వినిపించే విధంగా భగవంతుడిని స్మరిస్తే దాన్ని వాచికము అని, శబ్దాలేవీ బయటకు రాకుండా కేవలం పెదవులు కదుపుతూ, నాలికతో చేసే జపాన్ని ఉపాంశువు అని అంటారు. నాలిక, పెదవులు రెండూ కదపకుండా, నిశ్చలంగా మౌనంగా మనస్సు లోపలే చేసే జపాన్ని మానసికము అంటారు.
 
హస్తౌ నాభిసమౌ కృత్వా ప్రాతస్సంధ్యా జపం చరేత్
హృత్సమౌ తు కరౌ మధ్యే సాయం ముఖ సమౌ కరౌ
ప్రాతఃకాలంలో జపం చేసేటప్పుడు చేతులను నాభి వద్ద పెట్టుకుని, మధ్యాహ్నం వేళ జపం చేసేటప్పుడు హృదయము వద్ద పెట్టుకుని చేయాలి. సాయంత్రం జపం చేసేటప్పుడు చేతులను ముఖానికి సమాంతరంగా ఉంచుకోవాలి. అలాగే చందనపూసలు, అక్షతలు, పువ్వులు, ధాన్యం, మట్టిపూసలతో చేసిన జపమాలను ఉపయోగించరాదు. సింధూరపూసలు, దర్భ, ఎండిన ఆవుపేడ పూసలు, రుద్రాక్షలు, తులసి పూసలు లేదా స్ఫటిక పూసలతో చేసిన జపమాలు శ్రేష్టం అని పురాణాలు చెప్తున్నాయి. 
 
జపమాలలోని పూసలు ఖచ్చితంగా 108 ఉండేలా చూసుకోవాలి. జపమాల యొక్క రెండు కొసలను కలిపే పూసను ‘సుమేరుపూస’ అంటారు. జపము చేసేటప్పుడు జపమాల కనిపించకుండా పైన ఒక పొడి వస్త్రాన్ని కప్పాలి. జపమాలను ఉంగరపు వ్రేలు పై నుండి చూపుడువ్రేలిని ఉపయోగించకుండా బొటనవ్రేలితో పూసలను లెక్కించాలి. సుమేరుపూసను దాటి ముందుకు పోకుండా మాలను వెనుకకు త్రిప్పి జపము చేయాలి.

అన్నీ చూడండి

ఇక చెత్త రోడ్లకి చెల్లుచీటి, భారత రహదారుల రంగానికి సమగ్ర రోడ్ అసెస్‌మెంట్ టెక్నాలజీ పరిచయం

GTA 6 Mania: జీటీఏ-6పై ప్రధాని కామెంట్.. నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,127 కోట్ల పెట్టుబడి కోసం హిందుస్థాన్ కోకా-కోలాకు అనుమతులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. జగన్ మాత్రం మిస్సింగ్.. (photos)

తినడం, తాగడం, ఆనందించడం కాదు.. డబ్బు పొదుపు ముఖ్యం.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

కోటి వత్తులంట.. ఒకేసారి దేశాన్ని తగలబెట్టేయండి మీ రీల్స్ భక్తితో... నెటిజన్ ఆగ్రహం, వీడియో

19-11-2026 - గురువారం రాశి ఫలితాలు.. స్నేహితులు లేదా సహచరుల సూచనలను..?

ఇంట్లో సంపద పెరగాలంటే.. గురువారం ఊరగాయలను కొనిపెట్టండి..

18-11-2026 - బుధవారం రాశి ఫలాలు- ఆర్థికంగా అనుకూలత కనిపించినా..?

కార్తీక మాసం తొమ్మిదో రోజున తులసీ పూజ.. సిరిసంపదల కోసం...?

తర్వాతి కథనం
Show comments