శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (13:34 IST)

బ్రహ్మ ముహూర్తకాలంలో నిద్రలేస్తే.. ఒత్తిడి మటాష్.. సూర్యోదయాన్ని కనులారా వీక్షిస్తే?

బ్రహ్మ ముహూర్తకాలానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ ముహూర్తాన ఎలాంటి పనులు ప్రారంభించినా సకల శుభాలను ప్రసాదిస్తుందని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం అంటే... సూర్యోదయానికి 48 నిమిషాల ముందు సమ

బ్రహ్మ ముహూర్తకాలానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ ముహూర్తాన ఎలాంటి పనులు ప్రారంభించినా సకల శుభాలను ప్రసాదిస్తుందని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం అంటే... సూర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయం. అసురీ ముహూర్తానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా ఆధ్యాత్మిక పండితులు అంటుంటారు. 
 
బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే నిద్రలేస్తే.. ఇంటిపనులన్నీ.. ఆందోళన లేకుండా అయిపోతాయి. ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
విద్యార్థులు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే.. ఆ చదువు ఎప్పటికీ గుర్తుండిపోతుందని విశ్వాసం. ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి అనారోగ్య సమస్యలుండవు. సూర్యరశ్మి మనపై పడటం ద్వారా డి విటమిన్ లభిస్తుంది. దీంతో రోగాలు దూరమవుతాయి.
 
బ్రహ్మ ముహూర్తం గురించి.. 
రాత్రి భాగంలో ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మ ముహూర్తం అంటారు. మన శరీరంలోని జీవగడియలు ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో అద్భుతంగా పనిచేస్తాయని తద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది.