భర్త సిరి సంపదలు సంపాదించాలంటే... భార్య ఏం చేయాలి?
ప్రతి భార్య.. తాను కట్టుకున్న భర్తతో పాటు తన కుటుంబం పదికాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటుంది. ముఖ్యంగా తన భర్త సిరి సంపదలు సంపాదించాలని భావిస్తుంటుంది. అయితే, భర్త నిజంగానే సిరి సంపదలు సంపాదించాలంటే
ప్రతి భార్య.. తాను కట్టుకున్న భర్తతో పాటు తన కుటుంబం పదికాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటుంది. ముఖ్యంగా తన భర్త సిరి సంపదలు సంపాదించాలని భావిస్తుంటుంది. అయితే, భర్త నిజంగానే సిరి సంపదలు సంపాదించాలంటే భార్య కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా భార్య తన వద్ద పంచమాంగళ్యాలను అతి పవిత్రంగా చూసుకోవాలి. పంచమాంగళ్యాలు అంటే.. మెడలోని తాళి, నల్లపూసలు, తలలో పూలు, నుదుటన బొట్టు, చేతికి గాజులు, కాళ్ళమెట్లు. వీటినే పంచమాంగళ్యాలు అంటారు. వీటిని పవిత్రంగా చూసుకోవడమే కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
అలాగే, అగ్నిసాక్షిగా మెడలో కట్టిన తాళిని ఎపుడంటే అపుడు తీయరాదు. ఇలా తీయడం భర్తకు అరిష్టమట. అలాగే, నుదుట బొట్టు లేకుండా ఉండరాదట. ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకోకుండా ఉండకూడదట. ఇలాంటి చేయడం వల్ల భర్తకు అన్ని అనుకూలించడమేకాకుండా, సిరి సంపదలు చేకూరే అవకాశం ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు చెపుతున్నారు.