హనుమంతుడికి-శ్రీ కృష్ణుణికి ఇష్టమైన వెన్నకు ఏంటి సంబంధం?

శ్రీకృష్ణునికి ప్రీతికరమైన వెన్నను రాముడు హనుమంతుడికి ఎందుకిస్తాడు?

గురువారం, 28 ఏప్రియల్ 2016 (18:16 IST)
భూమాత పుత్రిక అయిన సీతమ్మ తల్లిని రాక్షస రాజైన రావణుని చెర నుంచి రక్షించే క్రమంలో శ్రీరాముడు యుద్ధంలో విజయం సాధిస్తాడు. అయినప్పటికీ ఇద్దరు రాక్షసులు రాముడి నుంచి తప్పించుకుని.. తపస్సు చేసి దేవరులను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిని ఎలా వధించాలో తెలియక దేవతలు తికమకపడ్డారు. ఆ సందర్భంలో హనుమంతుడే ఈ రాక్షసుల వధకు సరైనవాడని దేవతలు నిశ్చయించుకుంటారు. 
 
ఈ రాక్షసుల సంహారార్థం హనుమంతుడికి సహాయపడే రీతిలో సమస్త దేవతలు తమ తమ ఆయుధాలను ఆశీర్వదించి ఆయనకు అప్పగిస్తారు. వీరిలో శ్రీరాముడు తన ధనుస్సును, ముక్కంటి తన ఆయుధాలను ఆంజనేయుడికి ఇస్తారు. అయితే శ్రీరాముడు తన తర్వాతి అవతారమైన శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన వెన్నను హనుమంతుడికిచ్చి ఈ వెన్న కరిగేలోపు ఆ రాక్షసుల సంహారం పూర్తికావాలని గడువిస్తాడు. 
 
దీనిప్రరకారం రామభక్తుడైన హనుమాన్ కూడా రాముడిచ్చిన వెన్న కరిగేలోపు ఆ ఇద్దరు అసురులను సంహరిస్తాడు. అందుకే హనుమంతుడికి మనం నైవేద్యంగా వెన్నను సమర్పించి పూజచేస్తే.. ఆ వెన్న కరిగే లోపు మన కష్టాలు, దుఃఖాలు, ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాకుండా ఆ వెన్న కరిగేలోపు మనం సంకల్పించుకున్న సత్కార్యాలను ఆంజనేయుడు నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

ఒకటిన్నర ఏళ్ల పసికందుకు చిత్ర హింసలు.. తల్లి చూస్తుండగానే ప్రియుడు..?

ఇరాన్‌తో అణు ఒప్పందం.. తుది నిర్ణయం తీసుకోని డోనాల్డ్ ట్రంప్

వైఎస్సార్ విగ్రహం పైన దాడి చేసిన వ్యక్తి ఓ సైకో, సంయమనం పాటించండి

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు : మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశం

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కమ్ములాటలు

అన్నీ చూడండి

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

తర్వాతి కథనం
Show comments