శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షణ చేయాలా? ఆధార్ కార్డ్ తీసుకురండి!
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి దర్శనాలతో పాటు ఇతరత్రా సేవలను సైతం ఆన్‌లైన్ మయం చేసిన నేపథ్యంలో, ఇకపై స్వామివారి సన్నిధిలో అంగ ప్రదక్షణ చేయాలనుకునే భక్తులు ఆధార్ కార్డులతో రావాల్
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి దర్శనాలతో పాటు ఇతరత్రా సేవలను సైతం ఆన్‌లైన్ మయం చేసిన నేపథ్యంలో, ఇకపై స్వామివారి సన్నిధిలో అంగ ప్రదక్షణ చేయాలనుకునే భక్తులు ఆధార్ కార్డులతో రావాల్సిందే. పించన్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు, సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ అడుగుతున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఆధార్ తప్పనిసరి అని తితిటే ప్రకటించింది.
ఈ మేరకు ఆలయంలో అంగ ప్రదక్షణ చేయాలనుకునే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని జేఏవో శ్రీనివాసరాజు ప్రకటించారు. ఈ నియమం వచ్చే గురువారం నుంచి అమల్లోకి రానున్నట్లు శ్రీనివాసరాజు తెలిపారు.
స్వచ్ఛ భారత్‌లో భాగంగా తిరుమలలో వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించనున్నట్టు వెల్లడించారు. దీంతో పాటు బూందీపోటులో ఇకపై ప్రతి పౌర్ణమి, అమావాస్యకు శుద్ధి కార్యక్రమం చేపడతామన్నారు. అంతేగాకుండా.. వేలాది భక్తులు కోట్లు కుమ్మరించే శ్రీవారి కానుకల లెక్కింపు కోసం కొత్త కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.